ETV Bharat / business

వాట్సాప్​ పేమెంట్స్ ఇక​ మరింత ఆకర్షణీయం! - ఏమిటి వాట్సాప్​ పేమెంట్​ బ్యాగ్రౌండ్​ ఫీచర్​

పేమెంట్​ సేవలకు వాట్సాప్ కొత్త అప్​డేట్ ఇచ్చింది. 'పేమెంట్స్​ బ్యాగ్రౌండ్'​ పేరుతో.. లావాదేవీలను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఇంతకీ ఏమిటీ బ్యాగ్రౌండ్​ ఫీచర్​?

WhatsApp pay updates
వాట్సాప్​ పే అప్​డేట్స్​
author img

By

Published : Aug 17, 2021, 5:15 PM IST

ప్రముఖ ఆన్​లైన్​ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​.. పేమెంట్ సర్వీస్​లకు మరిన్ని హంగులు దిద్దింది. 'పేమెంట్స్​ బ్యాగ్రౌండ్'​ పేరుతో నగదు బదిలీతో పాటు ఫీలింగ్స్ కూడా​ తెలిపేలా (పేమెంట్​ ఉద్దేశం అర్థమయ్యేలా).. వివిధ రకాల థీమ్స్​ను అందుబాటులోకి తెచ్చింది. నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ), యూనిఫైడ్​ పేమెంట్​ ఇంటర్​ఫేస్​ (యూపీఐ)తో కలిసి సంయుక్తంగా ఈ డిజైన్ల​ను రూపొందించినట్లు వాట్సాప్​ పేర్కొంది. దేశవ్యాప్తంగా 227కు పైగా బ్యాంకుల కస్టమర్లు వాట్సాప్​ పేమెంట్ సేవలను వినియోగించుకునే వీలుందని వివరించింది.

'ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను, ఆలోచనలు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు వాట్సాప్​ ఓ సురక్షితమైన వేదిక. పేమెంట్స్ విషయంలో.. ఇకపై డొనేషన్, సెలెబ్రేషన్​, ఎఫెక్షన్​, ఫన్​.. వంటి థీమ్స్​ను​ జోడించి మరింత ఆకర్షణీయంగా లావాదేవీలు జరపొచ్చు. యూజర్లు అవసరం అనుకుంటేనే ఈ ఫీచర్​ వాడుకోవచ్చు' అని వాట్సాప్ ఇండియా పేర్కొంది.

డబ్బులు పంపించుకోవడం, రిసీవ్​ చేసుకోవడం లావాదేవీ మాత్రమే కాదని.. దాని వెనక వెల కట్టలేని అనుభూతి ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది. అందుకే ఈ థీమ్స్​తో పేమెంట్స్​ సరీస్​ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వివరించింది.

ఇదీ చదవండి: వ్యాక్సిన్​తో భారత​ ఫార్మాకు రూ.81 వేల కోట్ల మార్కెట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.