ETV Bharat / business

షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో మీకు తెలుసా? - షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటో మీకు తెలుసా?

షార్ట్ సెల్లింగ్ అంటే మీ సొంతం కానీ షేర్ల‌ను విక్ర‌యించ‌డం. అంటే ఆ షేర్ల ధ‌ర ప‌డిపోతుంద‌ని అంచ‌నా వేసిన‌ప్పుడు, అందులో లాభం పొందేందుకు షార్ట్ సెల్లింగ్ చేస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజిల ద్వారా వేరొక‌రి షేర్ల‌ను అప్పుగా తీసుకొని విక్ర‌యిస్తారు. అయితే షార్ట్ సెల్లింగ్ చాలా రిస్క్‌తో కూడుకున్న‌ది. మీకు ఇందులో నైపుణ్యం ఉంటే త‌ప్ప షార్ట్ సెల్లింగ్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

What is short selling
షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి?
author img

By

Published : Mar 4, 2020, 6:03 AM IST

షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటో మీకు తెలుసా? మీరెప్పుడైనా దీని గురించి విన్నారా? అయితే ఇది మీ కోసమే. షార్ట్ సెల్లింగ్ అంటే మీ సొంతం కానీ షేర్ల‌ను విక్ర‌యించ‌డం. అంటే ఆ షేర్ల ధ‌ర ప‌డిపోతుంద‌ని అంచ‌నా వేసిన‌ప్పుడు, అందులో లాభం పొందేందుకు షార్ట్ సెల్లింగ్ చేస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజిల ద్వారా వేరొక‌రి షేర్ల‌ను అప్పుగా తీసుకొని విక్ర‌యిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు, ఏబీసీ లిమిటెడ్ ధ‌ర రూ.100 గా ఉంది. అది రూ.80 కి ప‌డిపోతుంద‌ని మీరు అనుకుంటున్నారు. అప్పుడు ఏబీసీ కంపెనీ షేర్ల‌ను అప్పుగా తీసుకొని రూ.100 కి అమ్ముతారు. అది ఎప్పుడైతే రూ.80 కి ప‌డిపోతుందో అప్పుడు వాటిని తిరిగి కొనుగోలు చేసి, ఎవరి ద‌గ్గ‌ర తీసుకున్నారో వారికి తిరిగి ఇస్తారు. అప్పుడు మీకు రూ.20 లాభం వ‌స్తుంది. అప్పు తీసుకున్న షేర్ల‌పై మీకు రూ.2 వ‌డ్డీ ప‌డుతుంది. అంటే రూ.18 లాభం పొందుతారు.

అయితే షార్ట్ సెల్లింగ్ చాలా రిస్క్‌తో కూడుకున్న‌ది. ఎందుకంటే షేరు ధ‌ర ఎంత పెరుగుతుందో చెప్ప‌లేం. అటువంటి స‌మ‌యంలో న‌ష్ట‌పోతారు. మీకు ఇందులో నైపుణ్యం ఉంటే త‌ప్ప షార్ట్ సెల్లింగ్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

ఇదీ చూడండి: 'కొత్త ఆదాయ పన్ను విధానంతో ఉద్యోగులకు నష్టమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.