ETV Bharat / business

'కొవిషీల్డ్​ టీకా అత్యవసర వినియోగానికి త్వరలో దరఖాస్తు' - సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా

కొవిషీల్డ్ టీకా​ అత్యవసర వినియోగానికి రెండు వారాల్లో దరఖాస్తు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలా వెల్లడించారు. 2021 జులై నాటికి కనీసం 300-400 మిలియన్ల టీకా డోసులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.

We are in the process of applying for emergency use authorization of Covishield in the next two weeks: Serum Institute of India CEO Adar Poonawalla
'కొవిషీల్డ్​ అత్యవసర వినియోగానికి రెండు వారాల్లో దరఖాస్తు'
author img

By

Published : Nov 28, 2020, 7:41 PM IST

కొవిషీల్డ్ కరోనా టీకా​ అత్యవసర వినియోగానికి అనుమతులు పొందేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(సీఐఐ) సీఈఓ అదర్​ పూనావాలా వెల్లడించారు. రెండు వారాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నారు.

వ్యాక్సిన్​ డోసుల కొనుగోళ్లపై ప్రభుత్వంతో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదన్నారు పూనావాలా. అయితే 2021 జులై నాటికి కనీసం 300-400 మిలియన్ల టీకా డోసులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

తొలుత ఈ టీకా​ను భారత్​లో సరఫరా చేస్తామని.. అనంతరం ఆఫ్రికాలో పంపిణీపై ఆలోచిస్తామని వెల్లడించారు సీఐఐ సీఈఓ.

'ప్రధాని జ్ఞానం అద్భుతం..'

వైరస్​ వ్యాక్సిన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న జ్ఞానాన్ని చూసి తాము ఆశ్చర్యపోయామని అదర్​ వెల్లడించారు. చాలా విషయాలు ప్రధానికి ముందే తెలుసని, తాము వివరించేందుకు చాలా తక్కువే ఉందని పేర్కొన్నారు. పుణెలోని సీఐఐ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సందర్శించిన నేపథ్యంలో అదర్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి:- కరోనా వ్యాక్సిన్ల పురోగతి ఎలా ఉందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.