ETV Bharat / business

క్రెడిట్​ కార్డు రద్దు చేసుకోవాలనుకుంటున్నారా? - క్రెడిట్ కార్డు వివరాలు

కరోనా వల్ల చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్రెడిట్​ కార్డు ఖర్చులు అదనపు భారమని కొంతమంది భావిస్తున్నారు. ఫలితంగా క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకోవాలని చూస్తున్నారు. అయితే రద్దు చేసుకునే ముందు ఏం చేయాలి? ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం.

credit card
క్రెడిట్​ కార్డు
author img

By

Published : Sep 13, 2020, 10:31 AM IST

కొన్నేళ్లుగా క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగిపోయింది. వేతన జీవుల్లో వీటి వాడకం అనేది సాధారణంగా మారింది. ముఖ్యంగా పట్టణాల్లో ఈ కార్డుల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డులు సాధారణ చెల్లింపుల సాధనంగా మారింది. వీటిని ఆన్‌లైన్‌లో అన్ని రకాల అవసరాల కోసం వాడుకోవచ్చు. అంతేకాకుండా వీటిని ఆఫ్‌లైన్‌లో కూడా వినియోగించే వీలు ఉంది.

లభ్యత పెరిగిపోవటం వల్ల ఒకటి కన్నా.. ఎక్కువ కార్డులను వినియోగిస్తున్నారు. బహుళ కార్డుల వల్ల వివిధ రకాల ప్రయోజనాలతో పాటు క్రెడిట్‌ లిమిట్‌ కూడా పెరుగుతుంది. అయితే కొవిడ్‌ వల్ల క్రెడిట్​ కార్డులను అదనపు భారంగా భావిస్తున్న చాలా మంది వాటిని రద్దు చేసుకునే యోచనలో ఉన్నారు. రద్దు కోసం కస్టమర్‌ కేర్‌ను సంప్రదించటం కానీ లేదా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యంగా వార్షిక ఫీజుకు తగ్గ ప్రయోజనాలు పొందటం లేదని, కార్డును పూర్తిగా ఉపయోగించుకోలేని సమయంలో రద్దు చేసుకోవాలనుకుంటారు. అయితే దీని వల్ల క్రెడిట్‌ స్కోరుపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. రద్దు బదులు డౌన్​గ్రేడ్‌ చేసుకునే అవకాశం ఉంది.

క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకునే ముందు పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బిల్లు చెల్లించాలి..

కార్డు రద్దు చేసే సమయంలో ఎలాంటి బకాయి లేకుండా చూసుకోవాలి. ముందే బిల్లును పూర్తిగా చెల్లించవచ్చు. కార్డుకు వార్షిక ఫీజు ఉన్నట్లయితే.. దానికి సంబంధించిన గడువు పూర్తికాకముందే రద్దు చేసుకోకపోవటం మేలు. కార్డు తీసుకున్న అనంతరం రద్దు చేసుకునేందుకు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలోపు రద్దుచేసుకున్నట్లయితే వార్షిక ఫీజును తిరిగి పొందవచ్చు. చెల్లించాల్సిన బిల్లు లేనట్లయితే వార్షిక ఫీజు రీఫండ్‌ వచ్చిన సమయంలో.. బ్యాంకులు, వినియోగదారులకు అందిస్తాయని బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

బిల్లు పెండింగ్‌ ఉన్నట్లయితే రద్దు చేసుకోవటం వీలు కాదు. బిల్లు చెల్లించని పక్షంలో వడ్డీ, ఆలస్య రుసుము కట్టాల్సి వస్తుంది. దీనివల్ల క్రెడిట్‌ స్కోరు కూడా దెబ్బతింటుంది. క్రెడిట్‌ కార్డుపై ఈఎమ్‌ఐలు ఉన్నట్లయితే ఒకేసారి వాటిని చెల్లించే వీలు కూడా ఉంటుంది.

రివార్డులను ఉపయోగించుకోండి..

రద్దు చేయటానికంటే ముందే కార్డును ఉపయోగించటం ఆపేయాలి. దీనివల్ల స్టేట్‌మెంట్‌ కూడా మూసేసేందుకు అవకాశం కలుగుతుంది. కార్డు వినియోగం వల్ల జమ అయిన రివార్డు పాయింట్లను ముందే ఉపయోగించుకోవాలి.

స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్చన్స్‌ బదిలీ చేయండి.

చెల్లింపులు జరపమని బ్యాంకుకు వినియోగదారుడు ఇచ్చే సూచనలే స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్చన్‌. ఆన్‌లైన్‌ సబ్‌స్ర్కిప్షన్స్‌, ఈఎమ్‌ఐ, పలు రకాల బిల్లులకు సంబంధించి ఇవి ఉపయోగపడుతాయి. కార్డును రద్దు చేసేకంటే ముందే వీటిని కూడా రద్దు చేయటం కానీ, వేరే ఖాతాకు గానీ మార్చుకోవాలి.

బిజినెస్‌ కార్డుకు అనుసంధానమైన ఇతర కార్డులు ఉన్నట్లయితే.. వాటి రద్దు గురించి ఆ కార్డుదారులకు సమాచారం ఇవ్వాలి.

క్రెడిట్‌ యుటిలైజేషన్‌ నిష్పత్తి..

అనుమతించిన క్రెడిట్‌ లిమిట్‌లో ఉపయోగించుకున్న మొత్తాన్ని క్రెడిట్‌ యుటిలైజేషన్ అంటారు. ఇది ఎక్కువ ఉన్నట్లయితే క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రెండు కార్డుల్లో ఒక కార్డును రద్దు చేసుకోవటం వల్ల క్రెడిట్‌ యుటిలైజేషన్‌ నిష్పత్తి పెరుగుతుంది.

మళ్లీ కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే.. కొన్ని బ్యాంకులు సమీప కాలంలో క్రెడిట్‌ కార్డు ఖాతాలను రద్దు చేసుకున్న వారికి ప్రవేశ ప్రయోజనాలను అందించవు. కాబట్టి రద్దు చేసిన తేదీని తెలుసుకోవాలి.

ఇదీ చూడండి: రిటైర్మెంట్​ జీవితం సాఫీగా సాగాలంటే ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.