ETV Bharat / business

కరోనాతో విమానయాన రంగానికి భారీ నష్టం - విమానయాన రంగం లేటెస్ట్​ న్యూస్​

ఈ ఏడాది విమానయాన రంగంపై కరోనా వైరస్​ తీవ్ర ప్రభావం చూపనుందని ఇంటర్నేషనల్​ ఎయిర్​ ట్రాన్స్​పోర్ట్​ అసోసియేషన్​ అభిప్రాయపడింది. వైరస్​ కారణంగా 63 బిలియన్​ డాలర్ల నుంచి 113 బిలియన్ డాలర్ల మేర ఆదాయం కోల్పోయే అవకాశముందని తెలిపింది.

corona to hit airline industry
విమాన రంగానికి కరోనా
author img

By

Published : Mar 5, 2020, 6:45 PM IST

ప్రపంచ విమానయాన పరిశ్రమపై కరోనా వైరస్​ తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విమానయాన సంస్థల ఆదాయం 63 బిలియన్​ డాలర్ల నుంచి 113 బిలియన్​ డాలర్ల మేర కోల్పోయే ప్రమాదం ఉందని పరిశ్రమల విభాగం ఇంటర్నేషనల్ ఎయిర్​ ట్రాన్స్​పోర్ట్​ అసోసియేషన్​ (ఐఏటీఏ) హెచ్చరించింది.

ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ద్వారా వచ్చే ఆదాయం 19 శాతం మేర తగ్గుతుందని ఐఏటీఏ అంచనా వేసింది. ఈ మొత్తం.. ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో విమానయాన రంగం చూసిన నష్టంతో సమానమని పేర్కొంది.

ఐఏటీఏ గతనెల అంచనా వేసిన నష్టం(29.3 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే.. ప్రస్తుత అంచనా చాలా ఎక్కువ. ఎందుకంటే గత నెలతో పోలిస్తే ఇప్పుడు కరోనా వైరస్ చైనా వెలుపల దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 80 దేశాలకు కరోనా విస్తరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 95,000 మంది కరోనా బారిన పడగా.. 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.