ETV Bharat / business

లాక్​డౌన్ ఫ్రస్ట్రేషన్​ను బయటపెడితే క్యాష్​బ్యాక్! - vao app features

'నెల రోజులుగా ఇంట్లోనే కూర్చుని పిచ్చెక్కుతోంది.. ఒక్క రూపాయి సంపాదన లేక బుర్ర వేడుక్కుతోంది..' లాక్​డౌన్​ వేళ ఏ ఇంట చూసినా.. ఇదే ఫ్రస్ట్రేషన్​! అందుకే, మీ ఒత్తిడిని పోగొట్టేందుకు ఓ వినూత్న ఫీచర్​ను తీసుకొచ్చింది సామాజిక మాధ్యమం​ ​వెంట్ఆల్​ఔట్​(వీఏఓ). మీ నిజజీవిత కథలను పంచుకుని.. డబ్బులు సంపాదించేలా 'వెంట్​ అండ్​ ఎర్న్​' ఆఫర్​ను ప్రకటించింది. మరి ఆ సంగతులేంటో తెలుసుకుందాం రండి..

Vernacular social media platform VAO introduces cashbacks for venting out frustration
లాక్​డౌన్​ వేళ ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించుకోచ్చు!
author img

By

Published : Apr 25, 2020, 12:52 PM IST

నిరాశ, ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించటమే ధ్యేయంగా పనిచేసే వెంట్ ఆల్ ​ఔట్​(వీఏఓ) యాప్​​.. ఇప్పుడు వినియోగదారులపై కాసుల వర్షం కురిపించే 'వెంట్ అండ్​ ఎర్న్​'​ ఆఫర్​ తీసుకొచ్చేసింది.

ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో మాననసిక ప్రశాంతతను పెంపొందించేందుకు రూపొందించిందే ఈ వీఏఓ యాప్​. మనలోని ప్రతికూల శక్తులను పారదోలి సానుకూల దృక్పథాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది ఈ సామాజిక మాధ్యమం​. ఇందులో వినియోగదారులు వారి జీవిత గాథలను పోస్ట్​ చేయొచ్చు, ఇతరుల పోస్టుల నుంచి ప్రేరణ పొందొచ్చు. ఇప్పటి వరకు వీఏఓ యాప్​లో 12 వేల మంది వినియోగదారులు రిజిస్టర్ అయ్యారు. అయితే, లాక్​డౌన్​ వేళ ఈ యాప్​కు డిమాండ్ ఒక్కసారిగా 20-23 శాతం పెరిగిపోయింది.

అందుకే,​ వినియోగదారులకు ఈ లాక్​డౌన్​ కాలాన్ని లాభదాయకంగా మార్చే ప్రయత్నం చేస్తోంది వీఏఓ. వెంట్​ అండ్​ ఎర్న్​ అనే కొత్త ఫీచర్​ను ప్రవేశ పెట్టింది.

"గత కొద్ది నెలల్లోనే వీఏఓ వేదికపై ప్రజలు గడిపే కాలం గణనీయంగా పెరిగింది. మా వెబ్​సైట్​ను ఇష్టపడేవారి సంఖ్య సుమారు 66% పెరిగింది. మా కంటెంట్​ను చూస్తున్నవారి సంఖ్య 100% పెరిగింది. లాక్​డౌన్​ వేళ వారి కథలను మాతో పంచుకోవడమే కాదు, ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో మా నిపుణులను అడుగుతున్నారు ప్రజలు. అందుకే, వారిని ఉత్సాహపరచడానికి, మేము వెంట్​ అండ్​ ఎర్న్​ అనే కొత్త ఫీచర్​ తీసుకొచ్చాం. అంటే డబ్బు సంతోషాన్నిస్తుందని కాదు కానీ, ఏదో గెలిచామన్న సంతృప్తి వారిలో ఆనందాన్ని నింపుతుంది."

-సుమిత్ మిత్తల్, వీఏఓ వ్యవస్థాపకుడు, సీఈఓ

వెంట్ అండ్​ ఎర్న్​లో ఒక్కో స్టోరీకి 12 రూపాయల వరకు సంపాదించవచ్చు. కనీసం 100 పదాల భావాన్ని వ్యక్తపరిచి, లేదా ఏదైనా స్టోరీలకు 50 పదాల కమెంట్​ పెట్టినవారు ఈ వెంట్​ అండ్​ ఎర్న్​కు అర్హులు. అయితే, ఆ కంటెంట్​ వీఏఓ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. దేశ వ్యతిరేక లేదా దొంగలించిన కంటెంట్​ను వీఏఓ అనుమతించదు.

ఇదీ చదవండి:గురకే కదా అని వదిలేస్తే ఇక అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.