'మేధో సంపత్తి హక్కుల రద్దుతో టీకా ఉత్పత్తి పెరగదు' - property rights in covid vaccine
టీకాల అధికోత్పత్తికి ఐపీఆర్ అవరోధం కానే కాదని ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాసూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) తెలిపింది. మేధో సంపత్తి హక్కులు రద్దు చేసినప్పటికీ టీకాల ఉత్పత్తి పెరిగే అవకాశం లేదని అభిప్రాయపడింది.
మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్) రద్దు చేసినప్పటికీ టీకాల ఉత్పత్తి పెరిగే అవకాశం లేదని ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాసూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) అభిప్రాయపడింది. టీకాల అధికోత్పత్తికి ఐపీఆర్ అవరోధం కానే కాదని పేర్కొంది.
ఓపీపీఐ మనదేశంలో 1965లో ఏర్పాటైంది. ఔషధ పరిశోధనలో నిమగ్నమై ఉన్న బహుళ జాతి ఫార్మా కంపెనీలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. కొవిడ్-19 మహమ్మారి ముప్పు విస్తరిస్తున్న నేపథ్యంలో అందరికీ కొవిడ్-19 టీకా అందుబాటులోకి వచ్చే విధంగా టీకాలపై ఐపీఆర్ హక్కులు తాత్కాలికంగా రద్దు చేయాలని మనదేశంతో పాటు, దక్షిణాఫ్రికా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లూటీఓ) ముందు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
దీనికి యూఎస్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీకా లభ్యతను పెంచాల్సిన అవసరం ఉందని, అయినప్పటికీ టీకా తయారీ, అధికోత్పత్తి ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అనేది గుర్తించాలని ఓపీపీఐ పేర్కొంది. అన్నింటికీ మించి టీకా తయారీ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం అవసరమని వివరించింది.
టీకా తయారీ సంస్థలకు అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లభించటంతో పాటు అధికంగా ఉత్పత్తి చేయటానికి వీలుకల్పించే సదుపాయాలు ఉండాలని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఐపీఆర్ రద్దు వల్ల వెనువెంటనే ఆశించిన ఫలితాలు రావని విశ్లేషించింది. ఐపీఆర్ హక్కుల రద్దుతో నకిలీ టీకాలు తయారై రోగుల భద్రత ప్రశ్నార్థకం అవుతుందని అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: గూగుల్ మ్యాప్స్‌లో ఆక్సిజన్ పడకల సమాచారం!