ETV Bharat / business

సెకండ్​ హ్యాండ్​లో కారు కొంటున్నారా? ఇది మీ కోసమే..

కరోనా కారణంగా చాలా మంది క్యాబ్​లు, ఆటోలలో ప్రయాణించేందుకు మొగ్గుచూపడం లేదు. ఎవరి ద్వారా వైరస్ వ్యాపిస్తుందోననే భయాలు ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చాలా మంది సొంతంగా కారు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొవిడ్​తో ఆదాయం తగ్గిన చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్లవైపు చూస్తున్నారు. మరి సెకండ్​ హ్యాండ్​ కార్లకు ఫినాన్స్ లభిస్తుందా? ఫినాన్స్​ కాకుండా కార్లు కొనేందుకు ఇంకేమైనా మార్గాలున్నాయా? అనే విషయాలు మీ కోసం.

used car
సెకండ్​ హ్యాండ్​లో కారు కొంటున్నారా? ఇది మీ కోసమే..
author img

By

Published : Aug 29, 2020, 8:21 AM IST

Updated : Aug 29, 2020, 9:28 AM IST

కరోనా మూలంగా.. సెకండ్ హ్యాండ్​ కార్లకు బాగా డిమాండ్‌ పెరుగుతోంది. రుణం ద్వారా వాహనాలను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్త కారు కంటే వినియోగించిన కారు కొనుగోలు విషయంలో ఫినాన్సింగ్‌ కష్టమని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా.. ప్రత్యామ్నాయ సదుపాయాలతో కారు సొంతం చేసుకునేందుకు పలు సూచలను ఇస్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా!

కార్ల డిమాండ్​కు కారణాలు..

ఇప్పటి వరకు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజారవాణాను ఉపయోగించే వారు. అయితే కరోనా వల్ల ప్రజా రవాణా తగ్గిపోయింది. కొవిడ్ భయాల వల్ల ఆటోలు, క్యాబ్‌లు ఎక్కేందుకు చాలా మంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు సొంత వాహనం కొనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు భారీ మొత్తంలో కాకుండా.. బడ్జెట్​ ధరలో కార్లు కొనేందుకు వినియోగదారులు ఇష్టపడుతున్నట్లు ఆటోమొబైల్ డీలర్లు చెబుతున్నారు. ఈ కారణంగా సెకండ్ హ్యండ్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఓఎల్​ఎక్స్​ సర్వే..

సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయాల ప్లాట్​ఫామ్​ అయిన ఓఎల్​ఎక్స్​ ఈ అంశంపై ఏప్రిల్-జులై మధ్య ఓ సర్వే చేసింది. దీని ప్రకారం 54 శాతం మంది మూడు నుంచి ఆరు నెలల్లో వినియోగించిన కార్లను కొనేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కొత్త కార్ల మార్కెట్‌ కంటే సెకండ్​ హ్యాండ్ కార్ల మార్కెట్‌ దాదాపు 1.2 రెట్లు పెద్దదని సర్వే అంచనా వేసింది.

రుణాలు కష్టం..

వినియోగించిన కార్ల కొనుగోలుకు రుణాలు లభించడం.. కొత్త కార్లతో పోలిస్తే కష్టమైన పనని చెబుతున్నారు నిపుణులు. సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో రిస్కు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. ఈ తరహా కార్ల కొనుగోలు విషయంలో.. ఫినాన్స్​కు సంబంధించి బ్యాంక్​లు మూడు నుంచి ఏడు శాతం ఎక్కువ వడ్డీని తీసుకుంటాయని వివరిస్తున్నారు.

ఫినాన్సింగ్​కు రిస్క్​..

పాత కార్ల కండీషన్‌ను అంచనా వేయడం అంత సులువైన పనేం కాదు. అంతేకాకుండా గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా? సర్వీసింగ్‌ చరిత్ర కూడా తెలుసుకోవటం కష్టం.

ఒకవేళ రుణ గ్రహీత.. అప్పు తిరిగి చెల్లించకుంటే.. కారును వేలం వేస్తాయి బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు. అయితే పాత కార్లను వేలంలో విక్రయిస్తే తక్కువ మొత్తానికి అమ్ముడవుతుంటాయి కాబట్టి.. రుణాన్ని పూర్తిగా రికవరీ చేసుకోవడం కష్టమవుతుంది. ఈ అంశాలన్నింటి కారణంగా బ్యాంకులు, ఫినాన్సింగ్ కంపెనీలు పాత కార్లకు రుణాలు ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపవని విశ్లేషకులు అంటున్నారు.

కార్లకు ఫినాన్సింగ్ ఇలా..

కారు సాధారణ జీవనకాలం 15 సంవత్సరాలు. బ్యాంకులు 8 నుంచి 10 సంవత్సరాలకు లోన్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఐదు సంవత్సరాలు వయస్సున్న కారు కొనుగోలు చేసినట్లైతే.. మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఫినాన్స్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఎక్కువ బ్యాంకులు మూడు కంటే ఎక్కువ రీసేల్‌లకు ఫినాన్స్‌ సదుపాయం కల్పించవు.

కొత్త కారు విషయంలో బ్యాంకులు ఫినాన్స్‌ సంస్థలు.. 85 నుంచి 100 శాతం వరకు రుణాన్ని అందిస్తాయి. అదే సెకండ్ హ్యాండ్​ కారు విషయంలో రుణ సదుపాయం.. 60 నుంచి 80 శాతం మాత్రమే ఉంటుంది.

లోన్‌ టూ వ్యాల్యూ సహా కారు మోడల్‌, వయస్సు, కారు కండిషన్‌ను పరిగణించి రుణ సదుపాయం కల్పిస్తారు.

ఇతర సదుపాయాలు

వినియోగించిన కారు కొనుగోలు విషయంలో బ్యాంకుల ద్వారా ఫినాన్స్‌ తీసుకోవటం కంటే ఇతర మార్గాల ద్వారా దానికి కావాల్సిన మొత్తం సమకూర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే గృహ రుణం ఉన్నట్లయితే దానిపై టాప్‌అప్‌ లోన్‌ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇందులో తిరిగి చెల్లించేందుకు ఎక్కువ గడువు ఉంటుంది కాబట్టి భారం కాస్త తక్కువగా పడుతుందని అంటున్నారు.

బంగారంపై రుణం..

వాడిన కార్ల కొనుగోలుకు బంగారంపై రుణం తీసుకోవటం కూడా మరో ఉత్తమ మార్గం. బంగారంపై రుణాలు 8.8 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి. తిరిగి చెల్లించేందుకు చాలా ఎక్కువ సమయం ఇస్తారు. బంగారం ధరలు ఇప్పుడు జీవన కాల గరిష్టం వద్ద ఉన్నాయి. 100 గ్రాముల రుణాన్ని తాకట్టు పెట్టి రూ.3.5 లక్షల రుణాన్ని సులభంగా పొందవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సెకండ్​ హ్యాండ్​ కార్లను విక్రయించే ప్లాట్‌ఫామ్‌లు రుణం ఇచ్చే సంస్థలలో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు కారు విలువను లెక్కించి ధ్రువీకరిస్తాయి. ఈ భాగస్వామ్య సంస్థలు తక్కువ వడ్డీ రేటుతో ఫినాన్సింగ్‌ సదుపాయం అందిస్తాయి. ఇది కూడా ఉత్తమమైన మార్గమేనని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:టిక్​టాక్​ కోసం మైక్రోసాఫ్ట్​తో వాల్​మార్ట్​ జట్టు!

Last Updated : Aug 29, 2020, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.