సౌదీ అరామ్కోకు తన 20 శాతం వాటా (Reliance-Aramco deal) విక్రయించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ జరుపుతున్న ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్ డాలర్లను సమీకరించాలని రిలయన్స్ ఆశించింది. అయితే.. ఈ ప్రయత్నాలు విరమించుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
"ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) వ్యాపారాల్లో ప్రతిపాదిత పెట్టుబడులను మళ్లీ లెక్కిస్తే ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉంటుందని సౌదీ అరామ్కో, రిలయన్స్ నిర్ణయించుకున్నాయి. భారత ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటికీ ప్రాధాన్య భాగస్వామిగా ఉంటుంది."
-రిలయన్స్ ఇండస్ట్రీస్.
తమ ఆయిల్ టు కెమికల్ వ్యాపారంలో 20శాతం వాటాను (Reliance-Aramco deal latest news) సౌదీ అరామ్కో విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని 2019లో జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. 2020 మార్చి నాటికి ఈ ఒప్పందం ముగుస్తుందని చెప్పారు.
అయితే.. ఆ నిర్దేశించుకున్న గడువును రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance-Aramco deal news) చేరుకోలేకపోయింది. అందుకు కరోనానే కారణమని చెప్పింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఒప్పందం జరుగుతుందని ఈ ఏడాది జరిగిన ఏజీఎంలోనూ అంబానీ తెలిపారు. అయితే.. ఈ ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి.
ఇదీ చదవండి:ప్రధాని మానసపుత్రిక ' ఐఎఫ్ఎస్సీ ' పురోగతిపై కీలక చర్చ!