ETV Bharat / business

కరోనా వేళ భారత్​లోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ

దేశంలో కరోనా సంక్షోభం నెలకొన్న వేళ అమెరికాకు చెందిన సంస్థలు భారత్​లో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇది భారత్​పై ఉన్న అపార విశ్వాసాన్ని నిరూపిస్తోందని వ్యాపార సలహాల సంఘం పేర్కొంది.

US FDI to India crosses USD 40 bn: Business advocacy group
కరోనా వేళ భారత్​లో విదేశీ పెట్టుబడుల వెల్లువ
author img

By

Published : Jul 18, 2020, 11:24 AM IST

అమెరికా నుంచి విదేశీ పెట్టుబడుల రూపంలో ఈ ఏడాదిలో భారత్‌కు 4 వేల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఇది భారత్​పై అమెరికా సంస్థలకు ఉన్న అపార విశ్వాసానికి ప్రతీక అని భారత్ కేంద్రంగా పనిచేసే వ్యాపార సలహాల బృందం పేర్కొంది.

కొవిడ్-19 వేళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా భారత్‌లో పెట్టుబడులు ఈ స్థాయిలో రావడం విదేశీ సంస్థలకు భారత్‌పై ఉన్న భరోసాని తెలియచేస్తున్నాయని అమెరికా- భారత వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు- యూఎస్ఐఎస్​పీఎఫ్​ స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. అందులో 20 బిలియన్ డాలర్లు గడచిన కొద్ది వారాల్లోనే వచ్చాయని చెప్పింది.

గూగుల్‌, ఫేస్‌బుక్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు... ఈ పెట్టుబడులు పెట్టిన వాటిలో ఉన్నాయి. భారత్‌ ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానంగా ఉందన్న యూఎస్​ఐపీఎఫ్​... కేవలం అమెరికా సంస్థలే కాక మధ్య ఆసియా దేశాలు, తూర్పు దేశాలు కూడా భారత్‌ వైపు చూస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: వీధి వ్యాపారులకు మొబైల్‌ యాప్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.