రుణ భారం పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో నిర్మాణాత్మక, ఆర్థిక రంగ సంస్కరణలు అత్యవసరమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) పేర్కొంది. అలాగే మధ్యకాలిక ఆర్థిక ఏకీకరణ వ్యూహం కూడా ఆవశ్యకమని తెలిపింది.
బలహీనంగా ఉంది..
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ఐఎమ్ఎఫ్ ప్రతినిధి గెర్రీ రైస్ మాట్లాడుతూ... సంస్థ ఇంతకుముందు అంచనా వేసినదాని కంటే భారత్‌లో ఆర్థిక వాతావరణం బలహీనంగా ఉందన్నారు.
బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు చేసినప్పటికీ, మరింత నిర్మాణాత్మక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైస్ అన్నారు. అందుకు తగ్గ కేటాయింపులు, ఉద్దీపనలు, ఆర్థిక వనరులు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఐఎమ్ఎఫ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాలను 4.8 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: దశాబ్దపు కనిష్ఠ స్థాయికి చమురు డిమాండ్.. కారణమిదే!