ఈ ఏడాది భారత్ 7.5 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఐరాస అంచనా వేసింది. 2022లో ఇది 10.5 శాతానికి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది పెట్టుబడుల వృద్ధి ఏకంగా 10.2 శాతం తగ్గొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులపై విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు పేర్కొంది ఐరాస.
ప్రపంచ వృద్ధిపై అంచనాలు ఇలా..
ప్రపంచార్థికం ఈ ఏడాది 5.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఐరాస అంచనా వేసింది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతుంటం వల్ల ప్రపంచార్థికం రికవరీ ఈ స్థాయిలో సాధ్యమవచ్చని పేర్కొంది.
చైనా, అమెరికా వృద్ధి రేటు ఈ ఏడాది వరుసగా 8.2 శాతం, 6.2 శాతంగా నమోదయ్యే అవకాశముందని ఐరాస పేర్కొంది. 1984 తర్వాత ఇదే అత్యధికం కావచ్చని వివరించింది.
దక్షిణాసియా వృద్ధి రేటు 2021లో 6.9 శాతానికి రికవరీ కావచ్చని అంచనా వేసింది ఐరాస. 2020లో ఈ ప్రాంత వృద్ధి రేటు 5.6 శాతం క్షిణించినట్లు గుర్తు చేసింది.