ETV Bharat / business

నకిలీ వార్తలపై కఠిన చర్యలకు ట్విట్టర్​ సంసిద్ధం!

వీడియోలను తారుమారు చేస్తూ తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న పోస్టులపై ట్విట్టర్​ స్పందించింది. అసత్య వార్తలను అరికట్టేందుకు కఠిన నిబంధనలను తీసుకొస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం​ పేర్కొంది.

నకిలీ వార్తలపై కఠిన చర్యలకు ట్విట్టర్​ సంసిద్ధం!
author img

By

Published : Nov 12, 2019, 2:03 PM IST

అసత్య వార్తలు, పోస్టులపై సామాజిక మాధ్యమాల దిగ్గజం.. ట్విట్టర్​ ఘాటుగా స్పందించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే నకిలీ వార్తలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. భౌతిక దాడులకు ఆస్కారం కలిగించేలా ఉండే నకిలీ వార్తలపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఏదైనా తారుమారు చేసిన వీడియోలను లైక్​, షేర్​ చేసే ముందు వినియోగదారులను హెచ్చరించేలా.. నకిలీ వార్తలపై మరింత సమాచారం అందించేలా న్యూస్​ ఆర్టికల్స్​ లింకులు​ పెట్టేందుకు సిద్ధమైంది. వీటి ద్వారా నకిలీ వార్తలేవో, నిజమైనవి ఏవో.. నిర్ధరించుకునేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు ట్విట్టర్​ పేర్కొంది.

ప్రజల అభిప్రాయాలతో ముందుకు

ప్రతిపాదిత నిబంధనలపై ట్విట్టర్​ ప్రజల అభిప్రాయాలను కోరింది. ఈ అభిప్రాయ సేకరణలను నవంబరు 27 వరకు తీసుకోనుంది. వినియోగదారుల అభిప్రాయాలను బట్టి.. దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చే 30 రోజుల ముందు మరో ప్రకటన చేస్తామని ట్విట్టర్​ వివరించింది.

ఘాటు విమర్శలతో ఫేక్​

గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై బరాక్​ ఒబామా.. అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఓ వీడియో ట్విట్టర్​లో హల్​చల్​ చేసింది. ఇటువంటి అసత్య సమాచారం ఎన్నో విపత్కర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందని ట్విట్టర్​ తెలిపింది. ఫొటో, ఆడియో, వీడియోను మార్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ట్వీట్లను అరికట్టేందుకు నిపుణులు, పరిశోధకులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: వీడియో: బాగ్దాదీని ఎలా మట్టుబెట్టారో తెలుసా..?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.