ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు ట్విట్టర్ మంగళవారం వెల్లడించింది. ఈ వివరాలన్నీ ఐటీ మంత్రిత్వ శాఖకు త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది.
తాజా ఐటీ నిబంధనల ప్రకారం.. వినియోగదారుల సంఖ్య 50లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్లో నివసిస్తూ ఉండాలి.
ఇవీ చదవండి: 'తుది దశకు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ నియామకం'