ETV Bharat / business

అపాచీ సరికొత్త రేసింగ్ బైక్​- ధర ఎంతంటే?

Apache RTR 165 RP: బైక్​ ప్రియుల కోసం సరికొత్త అపాచీ ఆర్​టీఆర్ 165 మోడల్​ను విడుదల చేసింది టీవీఎస్​ మోటార్స్. ఈ అధునాతన రేసింగ్​ బైక్ ధరను రూ.1.45లక్షలుగా నిర్ణయించింది. రేస్​ పర్​ఫార్మెన్స్​ సిరీస్​లో ఇదే తమ తొలి బైక్ అని పేర్కొంది.

Apache RTR 165 RP
అపాచీ సరికొత్త రేసింగ్ బైక్​- ధర ఎంతంటే?
author img

By

Published : Dec 23, 2021, 5:27 PM IST

Apache RTR 165 RP: టీవీఎస్​ మోటార్ కంపెనీ బైక్​ ప్రియుల కోసం సరికొత్త రేసింగ్ మోడల్​ను మార్కట్లోకి తీసుకొచ్చింది. అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ పేరుతో దీన్ని విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.45లక్షలుగా నిర్ణయించింది. రేసింగ్ పర్​ఫార్మెన్స్ సిరీస్​లో ఇదే తమ తొలి మోడల్ అని టీవీఎస్​ ప్రకటనలో తెలిపింది.

Apache RTR 165 RP
అపాచీ సరికొత్త రేసింగ్ బైక్​- ధర ఎంతంటే?

ఈ బైక్​ 164.9 సీసీ సామర్థ్యంతో 19.2 పీఎస్​ పవర్​ను జనరేట్​ చేస్తుందని సంస్థ పేర్కొంది. రేసింగ్​కు అనుకూలంగా ఉండే స్లిప్పర్​ క్లచ్​, అడ్జస్టబుల్​ క్లచ్​, బ్రేక్​ లెవర్స్, రెడ్​ వీల్స్​, సరికొత్త సీటింగ్​ ప్యాటర్న్​తో ఆకర్షణీయంగా ఈ మోడల్​ను డిజైన్​ చేసినట్లు చెప్పింది. రేసింగ్​ ట్రాక్​, రోడ్డుపై ఈ బైక్​ అదరగొడుతుందని తెలిపింది. మోటర్​ సైకిల్​ ప్రియుల కోసం అత్యాధునిక సాంకేతికతతో, ప్రీమియం ఫీచర్లతో దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించింది.

ఇదీ చదవండి: వాట్సాప్​లో అదిరే ఫీచర్లు- గ్రూప్ కాలింగ్​కు నయా లుక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.