ETV Bharat / business

స్పోర్ట్స్ బైక్​ల కంపెనీని కొన్న టీవీఎస్‌ - వాణిజ్య వార్తలు

బ్రిటన్‌కు చెందిన స్పోర్టింగ్‌ మోటార్‌సైకిళ్ల కంపెనీ నార్టన్‌ను కొనుగోలు చేసినట్లు టీవీఎస్‌ మోటార్స్ ప్రకటించింది. రూ.153 కోట్లతో నార్టన్‌ను చేజిక్కించుకున్నట్లు వెల్లడించింది భారత్‌కు చెందిన ఈ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం.

TVS Motor Company Completes Acquisition of Norton
టీవీఎస్ మోటార్స్ చేతికి నార్డన
author img

By

Published : Apr 18, 2020, 3:08 PM IST

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌.. బ్రిటన్‌లో ప్రసిద్ధి చెందిన స్పోర్టింగ్‌ మోటార్‌సైకిళ్ల కంపెనీ నార్టన్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.153 కోట్లు అని టీవీఎస్‌ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటన్‌లోని నార్టన్‌కు చెందిన ఆస్తుల్ని, బ్రాండ్లను అక్కడి టీవీఎస్‌ అనుబంధ సంస్థ స్వాధీనం చేసుకోనుంది.

నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను 1898లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జేమ్స్‌ లాన్స్‌డౌన్‌ నార్టన్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. ఈ కంపెనీ క్లాసిక్‌ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తికి బాగా ప్రసిద్ధి పొందింది. నార్టన్‌కు చెందిన వీ4, డామినేటర్‌, కమాండో 961 కేఫ్‌ రేసర్‌ ఎంకే-2, కమాండో 961 స్పోర్ట్‌ ఎంకే-2లు మోడళ్లు మంచి ఆదరణ పొందాయి.

ఇదీ చూడండి:కరోనా కాలంలోనూ ఈ వ్యాపారాల్లో జోష్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.