ETV Bharat / business

చైనాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదరలేదు: ట్రంప్ - వాణిజ్య యుద్ధం ముగియలేదు

చైనాతో వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదనపు సుంకాలు తగ్గించే.. ఒప్పందం కుదిరినట్లు చైనా ఇటీవల చేసిన ప్రకటనకు విరుద్ధంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా ఆందోళనలు పెంచుతున్నాయి.

ట్రంప్
author img

By

Published : Nov 9, 2019, 2:16 PM IST

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడిందనే ఆశలపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని ప్రకటించారు.

అమెరికాతో తొలి దశ ఒప్పందం కుదిరిందని.. తద్వారా దశలవారీగా ఒకరి వస్తువులపై ఒకరు సుంకాలు వెనక్కి తీసుకోనున్నామని చైనా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీన్ని ట్రంప్‌ కొట్టిపారేశారు.

"‘సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు (చైనా) కోరుకున్నారు. అయితే పూర్తిస్థాయి సుంకాల ఎత్తివేతపై మాత్రం వారు చర్చించలేదు. ఎందుకంటే నేను చేయనని వారికి తెలుసు. నేను మాత్రం ఇంకా ఎలాంటి ఒప్పందానికి అంగీకారం తెలపలేదు" అని శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని.. అందుకే ఒప్పందానికి ఉబలాటపడుతోందన్నారు.

చైనా ఏమందంటే..

తమ దేశ దిగుమతులపై అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అమెరికా అంగీకరించిందని చైనా వాణిజ్య అధికార ప్రతినిధి గావో ఫెంగ్ ఇటీవల ప్రకటించారు. తుది ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నారని.. ఇరు దేశాల మధ్య వ్యక్తమైన ఆందోళనలపై చర్చించామన్నారు.
ఈ ప్రకటనతో అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడినట్లేనని అంతా భావించారు. కానీ, ట్రంప్‌ తాజా ప్రకటనతో తిరిగి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: మీ పిల్లలు పాఠశాలకు సురక్షితంగా చేరుకుంటున్నారా?

AP Video Delivery Log - 0600 GMT News
Saturday, 9 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0544: India Temple AP Clients Only 4238970
Verdict expected in India's temple dispute
AP-APTN-0529: Australia Wildfires 3 Part no access Australia 4238969
Over 150 homes destroyed in Australia wildfires
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.