ETV Bharat / business

Treda Property Show: హైటెక్స్​లో ట్రెడా ప్రాపర్టీ షో.. మూడు రోజులపాటు ప్రదర్శన - భారీ స్థిరాస్తి ప్రదర్శన

హైదరాబాద్​లోని హైటెక్స్​లో తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భారీ స్థిరాస్తి ప్రదర్శనకు సిద్ధమైంది. అక్టోబర్​లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పదకొండోసారి జరుగుతున్న ఈ స్థిరాస్తి ప్రదర్శనలో అతి చౌకైన ఇళ్ల నుంచి ఐదారు కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది.

Treda Property Show
హైటెక్స్​లో ట్రెడా ప్రాపర్టీ షో
author img

By

Published : Sep 23, 2021, 4:25 PM IST

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ 11వ సారి అతిపెద్ద ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 1, 2, 3 తేదీల్లో హైదరాబాద్​లోని హైటెక్స్‌లో స్థిరాస్థి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. కరోనా కారణంగా గతేడాది ప్రాపర్టీ షో నిర్వహించలేకపోయినట్లు పేర్కొన్న ట్రెడా రాష్ట్ర అధ్యక్షుడు చలపతిరావు తెలిపారు. 2019 తర్వాత ఈ ఏడాది ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మూడు రోజులపాటు నిర్వహించే ఈ ప్రదర్శనకు దాదాపు 20వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రదర్శనలో ఫ్లాట్స్, విల్లాలు, అపార్ట్​మెంట్స్​, కమర్షియల్ స్పేస్​ అన్ని రకాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ స్థిరాస్తి ప్రదర్శనలో 110 మంది డెవలపర్లు 186 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చలపతిరావు పేర్కొన్నారు. కరోనా నిబంధనలకు లోబడే ఈ ప్రదర్శన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాపర్టీ షోలో 800ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన చౌకైన ఇళ్ల దగ్గర నుంచి ఐదారు కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు ఇందులో ప్రదర్శించనున్నట్లు ఆయన వివరించారు.

హైటెక్స్​లో ట్రెడా ప్రాపర్టీ షో

ఇదీ చూడండి: Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.