కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలకు 'ట్రాయ్' కీలక సూచనలు చేసింది. ప్రీ పెయిడ్ యూజర్లకు వ్యాలిడిటీ గడవు పెంచాలని టెల్కోలకు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరింది. వినియోగదారులకు నిరంతరాయంగా సేవలందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని టెల్కోలను ఆదేశించింది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో టెలికాం రంగాన్ని అత్యవసర సేవగా పరిగణించింది కేంద్రం. ఈ నేపథ్యంలో టెలికాం సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:కరోనా సమయాన 'స్టాక్' పెట్టుబడులు మంచిదేనా?