ETV Bharat / business

ఓటీపీలు ఆగాయ్‌.. లావాదేవీలు నిలిచాయ్‌

ఎస్ఎంఎస్​లకు సంబంధించి అమల్లోకి వచ్చిన ట్రాయ్ నిబంధనలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేశాయి. ఓటీపీలు రాకపోవడం వల్ల బ్యాంకు లావాదేవీలు, కొవిడ్ టీకా పేర్ల నమోదు వంటి అంశాల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎస్ఎంఎస్​ల నియంత్రణ కోసం తీసుకువచ్చిన నిబంధనల అమలును వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించింది.

OTP
ఓటీపీలు ఆగాయ్‌.. లావాదేవీలు నిలిచాయ్‌
author img

By

Published : Mar 10, 2021, 5:48 AM IST

Updated : Mar 10, 2021, 12:04 PM IST

వాణిజ్య సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్‌) కోసం సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ఓటీపీలు రాకపోవడంతో బ్యాంకు లావాదేవీలు, కొవిడ్‌ టీకాకు పేర్ల నమోదు వంటి అంశాల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నిబంధనలను 7 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ మంగళవారం తెలిపింది. ప్రధాన టెలికాం కంపెనీలు (టెల్కోలు) తమ ఎస్‌ఎమ్‌ఎస్‌ నమూనాలను రిజిస్టర్‌ చేసుకుని, వినియోగదార్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ట్రాయ్‌ సూచించింది.

ఇదీ జరిగింది

వాణిజ్య సందేశాల నియంత్రణకు ట్రాయ్‌ 2018లో రూపొందించిన కొత్త నిబంధనలు ఈనెల 8 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం.. టెల్కోలు ప్రతి ఎస్‌ఎమ్‌ఎస్‌ లేదా ఓటీపీలను సదరు వినియోగదారుడికి పంపే ముందు రిజిస్టర్డ్‌ సంక్షిప్త సందేశంతో సరిపోల్చి.. ధ్రువీకరించాలి. టెల్కోలు ఈ నిబంధనలను పాటించడం కోసం బ్లాక్‌చైన్‌ సాంకేతికతను వినియోగించుకున్నాయి. ఇందులో రిజిస్టర్‌ అయిన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే ధ్రువీకరించుకుని, వినియోగదారుడికి పంపుతారు. మిగతా ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తారు. కొత్తగా తీసుకొచ్చిన బ్లాక్‌చైన్‌ ప్లాట్‌ఫాం (డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ)పై రిజిస్టర్‌ చేసుకోకపోవడంతో దాదాపు 40 శాతం వరకు సందేశాలు సోమవారం నిలిచిపోయాయి. వినియోగదార్లకు అవి చేరకపోవడంతో ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగులు, ఆధార్‌ ధ్రువీకరణ, కొవిన్‌ రిజిస్ట్రేషన్లు, ఇతర ఓటీపీ సేవల విషయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

పరస్పర ఆరోపణలు

సోమవారం నాటి పరిణామాలపై బ్యాంకులు, టెల్కోలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. చెల్లింపు సంస్థలు, ఇతర కంపెనీలు సరైన చర్యలు చేపట్టలేదని టెల్కోలు ఆరోపించాయి. నిబంధనల అమలులో టెల్కోలు ద్రోహపూరిత ప్రక్రియను అనుసరించాయని బ్యాంకులు, చెల్లింపు సంస్థలు ఆరోపించాయి.

ట్రాయ్‌ ఏమందంటే..

'వినియోగదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు టెల్కోలు పంపే ఎస్‌ఎమ్‌ఎస్‌లపై నిబంధనలను వారం పాటు తాత్కాలికంగా నిలిపాం. ఈ సమయంలో టెల్కోలు తమ ప్రధాన కంపెనీలకు సమాచారం అందించి, తక్షణం తగిన చర్యలను తీసుకోవాలి. ఎస్‌ఎమ్‌ఎస్‌ టెంప్లేట్‌ల నమోదుతో పాటు ఇతరత్రా అవసరమైన అడుగులను వారం రోజుల్లో వేయాలి' అని పేర్కొంది.

మోసపూరిత సందేశాలు నిలిపేందుకే..

మోసపూరిత, అనధికారిక సంక్షిప్త సందేశాలను నిలువరించేందుకే బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత ఆధారిత నిబంధనలను ట్రాయ్‌ తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. బ్యాంకులు, చెల్లింపుల కంపెనీల వంటివి ఎస్‌ఎమ్‌ఎస్‌, ఓటీపీలు పంపినపుడు ఆయా సంస్థలు బ్లాక్‌చెయిన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న టెంప్లేట్లతో వాటిని సరిపోల్చుతారు. అవి సరిగ్గా ఉంటేనే.. ఆ ఎస్‌ఎమ్‌ఎస్‌లు సంబంధిత వ్యక్తులకు వెళతాయి. ఈ ప్రక్రియను ఎస్‌ఎమ్‌ఎస్‌ స్క్రబ్బింగ్‌ అంటారు.

ట్రాయ్‌ నిర్ణయం ప్రశంసనీయం: తాన్లా ఉదయ్‌ రెడ్డి

నిబంధనల అమలుకు కంపెనీలు, టెలిమార్కెటర్లకు మరింత సమయాన్ని ట్రాయ్‌ ఇవ్వడంపై తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఛైర్మన్‌, సీఈఓ ఉదయ్‌ రెడ్డి ప్రశంసించారు. తాన్లాకు చెందిన డీఎల్‌టీ(డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ) ప్లాట్‌ఫాం ట్రూబ్లాక్‌ ద్వారా వినియోగదార్లకు స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు అందకుండా చేయొచ్చు. ఆయా కంటెంట్‌ టెంప్లేట్లను రిజిస్టర్‌ చేసుకోవడంలో కంపెనీలు, టెలిమార్కెటర్లకు సహకరిస్తున్నట్లు ఉదయ్‌ రెడ్డి తెలిపారు. 34,000 కంపెనీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిపారు. భారత్‌లో 70 శాతం ఏ2పీ(అప్లికేషన్‌ టు పర్సన్‌ మేసేజింగ్‌)ను డీఎల్‌టీ ప్లాట్‌ఫాం ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

Last Updated : Mar 10, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.