ETV Bharat / business

రుణం ఉండ‌గా మ‌రో లోన్​ ల‌భిస్తుందా?

ఇదివరకే బ్యాంక్​ లోన్​ తీసుకుని ఉండి.. మళ్లీ రుణం తీసుకోవచ్చా? అనేది అందరికీ ఉండే సందేహమే. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంక్​లు వ్యక్తిగత, గృహ రుణాలపై టాప్​-అప్​ లోన్​లు ఇస్తాయని చాలా మందికి తెలియదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ లోన్​ పొందొచ్చు. వీటిపై ఉండే వడ్డీరేట్లు కూడా నామమాత్రమే. మరి ఈ టాప్​-అప్ లోన్​ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

top up loan which is known as extra financing option offered over and above the existing loan
రుణం ఉండ‌గా మ‌రో రుణం ల‌భిస్తుందా?
author img

By

Published : Apr 8, 2021, 3:28 PM IST

ఈ రోజుల్లో రుణం పొంద‌డం పెద్ద క‌ష్ట‌మైన పనేమీ కాదు. త‌గిన ప‌త్రాలు ఉంటే ఆర్థిక సంస్థ‌లు వ్య‌క్తిగ‌త‌, వ్యాపార‌, గృహ‌, వాహ‌న రుణాలు అందిస్తున్నాయి. అయితే మీరు ఇదివ‌ర‌కే రుణం తీసుకున్నారు. మ‌ళ్లీ డ‌బ్బు అవ‌స‌ర‌మైంది అప్పుడు ఏం చేయాలి. దీనికి ఓ మార్గం ఉంది. మీరు తీసుకున్న రుణాల‌పై టాప్‌-అప్‌లోన్ ను తీసుకోవ‌చ్చు. అదేవిధంగా ఇంటి రుణం తీసుకున్నాక ఇంకే రుణం తీసుకోవ‌డం వీల‌వుతుందా అని కొంత మంది అనుకుంటుంటారు. అయితే అదే రుణంపై మ‌ళ్లీ రుణం పొందే అవ‌కాశం మీకు టాప్ అప్ లోన్ ద్వారా వ‌స్తుంది.

టాప్-అప్ లోన్‌ అంటే?

టాప్అ-ప్ లోన్ అంటే ఇప్ప‌టికే రుణం తీసుకుని ఉండే దానిపై అద‌నంగా రుణం పొంద‌టం. ఇదేలా సాధ్యం - ఒక సారి రుణం తీసుకున్నాక మ‌ళ్ళీ రుణం తీసుకుందాం అంటే కుదురుతుందా! అది మీ అవ‌స‌రం బ‌ట్టి ఉంటుంది. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో రుణం తీసుకోవాల‌నుకుంటే మాత్రం టాప్ అప్ లోన్ తీసుకోవ‌చ్చు. వ‌డ్డీ రేట్లు కూడా ఇత‌ర రుణాల‌తో పోలిస్తే త‌క్కువ‌గా ఉంటాయి.

టాప్‌-అప్ లోన్ కోసం అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను అంద‌జేస్తే చాలు. ఇదివ‌ర‌కు ఉన్న రుణంపై వ‌డ్డీకి స‌మానంగా లేదా త‌క్కువ‌గా ఈ రుణాల‌ను అందిస్తారు. సాధార‌ణంగా వ్య‌క్తిగ‌త‌, గృహ రుణాల‌పై ఈ టాప్‌-అప్ లోన్ అందిస్తారు. ఉన్న‌త‌ విద్య‌, పెళ్లి, ప్ర‌యాణం, వైద్య చికిత్స వంటి అత్య‌వ‌స‌ర‌మైన స‌మ‌యాల్లో ఈ లోన్ తీసుకోవ‌చ్చు. టాప్‌-అప్ హోమ్ లోన్ తీసుకొని ఇంటిని ఆధునీకీక‌రించ‌వ‌చ్చు. త్వ‌ర‌గా రుణం పొంద‌డంతో పాటు త‌క్కువ వ‌డ్డీ రేట్ల కోసం టాప్-అప్ లోన్‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు.

ఇదీ చదవండి: పర్సనల్‌ లోన్‌ కావాలా? ఇవి తెలుసుకోండి..

టాప్-అప్ లోన్‌ ఎలా ఇస్తారు?

ఎక్కువ‌గా గృహ రుణాల‌పై టాప్‌-అప్‌లోన్ తీసుకుంటున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు ఈ స‌దుపాయాన్ని క‌లిపిస్తున్నాయి. గృహ రుణం చెల్లించడం మొదలైన 6 -12 నెల‌ల‌కు టాప్ అప్ లోన్ తీసుకునేందుకు అవ‌కాశం క‌లిపిస్తున్నాయి. ఇంటికి చాలా లోన్ తీసుకున్నాం క‌దా మ‌ళ్ళీ లోన్ కావాలంటే బ్యాంకులు ఇస్తాయా అనే సందేహం వ‌స్తుంది. అయితే ఇక్క‌డ లాజిక్ గ‌మ‌నిస్తే మీకు విష‌యం వివ‌రంగా అర్థ‌మ‌వుతుంది. ఇదెలా అంటే మొత్తం తీసుకున్న గృహ‌రుణం నుంచి త‌గ్గిన రుణాన్ని తీసివేస్తే వ‌చ్చే మొత్తానికి టాప్ అప్ లోన్ ఇస్తారు. అయితే ఈ కాలంలో స‌ద‌రు వ్య‌క్తుల‌కు ఆదాయం పెర‌గ‌డం ద్వారా రుణ మొత్తం ప‌రిమితి పెరుగుతుంది.

ఇదీ చదవండి: గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

టాప్-అప్ హోమ్ లోన్ వ‌డ్డీ రేట్లు, వ్య‌క్తిగ‌త రుణాలు, క్రెడిట్ కార్డులు, కార్ రుణాల‌ వ‌డ్డీ రేట్ల కంటే త‌క్కువ‌గా ఉంటాయి. కాల‌ప‌రిమితి కూడా ఎక్కువ‌గా ఉంటుంది. రుణం పొంద‌డం కూడా చాలా సుల‌భం. గృహాన్ని ఆధునీకీక‌రించ‌డం, రిపేర్లు చేయంచ‌డం, పున‌రుద్ధ‌రించ‌డం, పిల్ల‌ల ఉన్న‌త విద్య‌కోసం డ‌బ్బును కేటాయిస్తే దానిపై ప‌న్ను మిన‌హాయింపులు కూడా పొంద‌వ‌చ్చు. అందుకే ఎక్కువ‌గా వ్య‌క్తిగ‌త రుణాల కంటే టాప్‌-అప్ లోన్ తీసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

ఇదీ చదవండి: దా'రుణ' యాప్​ల బెదిరింపులు.. మళ్లీ మొదలు!

ప్రాసెసింగ్:

డ‌బ్బు అత్య‌వ‌స‌రమైన‌ప్పుడు వ్య‌క్తిగ‌త రుణం కంటే టాప్‌-అప్ లోన్ ఎంచుకోవ‌డం మంచిది. దీనికి ప్రాసెసింగ్ త్వ‌ర‌గా పూర్త‌వుతుంది. ఎందుకంటే రుణ‌గ్రస్తుడు ఇదివ‌ర‌కే రుణం తీసుకొని ఉన్నందున్న వారి వివ‌రాలు అన్ని తెలుస్తాయి. చాలా వ‌ర‌కు బ్యాంకులు రుణం తీసుకున్న‌ వినియోగ‌దారుల‌కు ప్రీ-క్వాలిఫైడ్ టాప్‌-అప్ ఆఫ‌ర్ ప్ర‌క‌టిస్తాయి. కొన్నిసార్లు హోమ్‌-లోన్ మీద టాప్‌-అప్ లోన్ తీసుకోవానుకుంటే ఆస్తిని పున‌ప‌రిశీల‌న చేయ‌వ‌ల‌సి రావ‌చ్చు. దీనికి వారం రోజుల స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఇదివ‌ర‌కే కేవైసీ పూర్త‌యితే తిరిగి ఎటువంటి డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దు. అదేవిధంగా తీసుకున్న రుణాల‌పై పేమెంట్ హిస్ట‌రీ బాగుంటే త్వ‌ర‌గా టాప్-అప్‌లోన్ అందిస్తారు.

ఇదీ చదవండి: ముద్ర రుణాలు @రూ. 15లక్షల కోట్లు

వ‌డ్డీ రేటు:

టాప్‌-అప్ లోన్‌పై వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. ఎందుకంటే మీ బ్యాంకు వ‌ద్ద ఇదివ‌ర‌కే మీరు తీసుకున్న రుణంపై చెల్లింపులు, స‌మ‌యానికి చెల్లిస్తున్నారో లేదో తెలుస్తోంది కాబ‌ట్టి మీ రుణ చ‌రిత్ర బాగుంటే త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందించే అవ‌కాశం ఉంటుంది. సాధార‌ణంగా గృహ‌రుణాల‌పై వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటుంది. అయితే దానిపై తీసుకునే టాప్ అప్ లోన్ పై వ‌డ్డీ రేటు దానికంటే 0.5-1 శాతం ఎక్క‌వ‌గా ఉంటుంది.

ఇదీ చదవండి: ఎస్​బీఐ షాక్​- హోం లోన్​ వడ్డీ రేట్లు పెంపు

టాప్-అప్ లోన్‌ మొత్తం:

ఈ టాప్ అప్ లోన్ పొందేందుకు రుణ చ‌రిత్ర బాగుండాలి. మీకు రుణం తీసుకునే ప‌రిమితి ఉన్నంత మాత్రాన రుణం ల‌భించ‌దు. మీ పాత చెల్లింపులు త‌దిత‌రాల‌ను బ‌ట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తుంటాయి. గృహ రుణంపై టాప్‌-అప్ లోన్ తీసుకునే మీకు ముందుగా ఇచ్చిన రుణం కంటే త‌క్కువ‌గా ఉంటుంది. ఎంత ఇవ్వాల‌న్న‌ది బ్యాంకు నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇది ల‌క్ష‌ల నుంచి కోటి వ‌ర‌కు కూడా ఉండొచ్చు. గృహ రుణ విష‌యంలో అయితే మీ ఆస్తి విలువ‌లో 70-80 శాతానికి మించి టాప్-అప్‌లోన్ అందించ‌రు.

ఇదీ చదవండి: ప్లాట్ రుణం తీసుకోవాలనుకుంటున్నారా?

తిరిగి చెల్లింపులు:

టాప్ -అప్ రుణ చెల్లింపుల‌కు గ‌డువు 20 ఏళ్ల వ‌ర‌కు ఉండొచ్చు లేదా మీ గృహ రుణం మొత్తం పూర్త‌య్యే వ‌ర‌కు ఉంటుంది. ఎంత కాల‌ప‌రిమితి అన్న‌ది బ్యాంకు నిర్ణ‌యిస్తుంది. మీ ఆదాయం, వ‌య‌సు, ఆస్తి విలువ వీటిని ప‌రిశీలించి బ్యాంకు రుణం పంపిణీ చేస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు:

టాప్-అప్ రుణం కోసం దాఖ‌లు చేసేట‌ప్పుడు మీ రుణ చ‌రిత్ర బాగుండేలా చూసుకోవాలి. ఇదివ‌ర‌కు తీసుకున్న రుణాల‌పై చెల్లింపుల‌ను బ‌ట్టి బ్యాంకులు మీకు టాప్-అప్ లోన్ పంపిణీ చేయాలా లేదా అని నిర్ణ‌యిస్తాయి. కాల‌ప‌రిమితి కూడా దీనిపై ఆధార‌ప‌డి ఉంటుంది. మీ క్రెడిట్ ప్రొఫైల్‌, క్రెడిట్ హిస్ట‌రీ కూడా కీల‌కం అవుతుంది.

ఇదీ చదవండి: గృహ రుణం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

క్రెడిట్​ స్కోరు తక్కువున్నా రుణాలు పొందండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.