మన దేశంలో కార్ల మార్కెట్‌కు బడ్జెట్ సెగ్మెంట్ చాలా కీలకం. భారత్‌లో కార్ల విక్రయాల్లో వీటి వాటా చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్య తరగతి ప్రజలు వీటికి మొగ్గు చూపుతుంటారు. ఈ విభాగంలో మైలేజ్, ధర చాలా కీలకంగా భావిస్తారు.
ఒకప్పుడు ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ ఉండేది. అయితే.. క్రమక్రమంగా బడ్జెట్ కార్ల వినియోగం పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులు పెరగటం వల్ల.. వీటికి డిమాండ్ పెరుగుతోంది. బడ్జెట్ విభాగంలో దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి.
ఇదీ చదవండి: యువతలో సొంతింటికి పెరిగిన డిమాండ్!
ఈ విభాగంలో టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం..
హ్యుందాయ్ ఐ20..
హ్యుందాయ్‌లో ఎక్కువ విక్రయాలు జరుపుతున్న దానిలో ఐ20 ఉంటుంది. ఆరు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్స్‌లో ఇది లభిస్తుంది. మోడల్‌ను బట్టి.. 5 స్పీడ్, 6 స్పీడ్ గేరింగ్ పొందవచ్చు. భద్రతపరంగా ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఈబీడీతో ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా పొందవచ్చు.
హైదరాబాద్ ఎక్స్ షోరూం ప్రకారం.. దీని ధర రూ.6.79 లక్షల నుంచి 11.32 లక్షల వరకు ఉంది.
- పెట్రోల్, డీజిల్, ఆటోమేటిక్, మ్యానువల్ మోడ్
- మైలేజ్ - 20.35 కిలోమీటర్ల నుంచి 25.2 కిలోమీటర్లు
- ఇంజిన్ 998-1493 సీసీ
- ఇంజిన్ ఆప్షన్లు 1.2 పెట్రోల్, 1.0 పెట్రోల్, 1.5 డీజిల్
- వేరియంట్స్ మాగ్నా, ఆస్టా, ఆస్టా(ఓ), స్పోర్ట్జ్
- 10.25 ఇంచుల ఇన్ఫోటెన్మెంట్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బోస్ సౌండ్ సిస్టమ్
- ఇతరాలు - సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జింగ్, క్రూజ్ కంట్రోల్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్
ఇదీ చదవండి: ఓలా ఈ-స్కూటర్ వచ్చేది ఎప్పుడంటే!
మారుతీ స్విఫ్ట్..
2021లో అప్డేటెడ్ మోడల్‌ను విడుదల చేసింది మారుతీ. డ్యూయల్ టోన్, సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. భద్రతపరంగా రెండు ఎయిర్ బ్యాగ్‌లు, ఈబీడీతో ఏబీఎస్, హిల్ అసిస్టెంట్‌తో ఈఎస్పీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
హైదరాబాద్ ఎక్స్ షోరూం ప్రకారం.. దీని ధర రూ.5.73 లక్షల నుంచి 8.41 లక్షల వరకు ఉంది.
- పెట్రోల్, ఆటోమేటిక్, మ్యానువల్ మోడ్
- మైలేజ్ - 23.20 కిలోమీటర్లు(మ్యానువల్), 23.76 కిలోమీటర్లు(ఆటోమేటిక్)
- ఇంజిన్ 1197 సీసీ
- వేరియంట్స్ ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ ఐ, జెడ్ఎక్స్ ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్, డ్యూయల్ టోన్ జెడ్ఎక్స్ఐ ప్లస్
- 7 ఇంచుల ఇన్ఫోటెన్మెంట్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో
- ఇతరాలు - క్రూజ్ కంట్రోల్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ
ఇదీ చదవండి: సొంతిల్లు కొంటున్నారా.. ఇవి తెలుసుకోండి?
మారుతీ బలెనో..
ఇటీవల దీని ధర రూ.20వేల వరకు పెరిగింది. ఈ కారును 9 వేరియంట్లలో, ఐదు భిన్న కలర్లలో పొందవచ్చు. రెండు ఎయిర్ బ్యాగ్‌లు, ఈబీడీతో ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
హైదరాబాద్ ఎక్స్ షోరూం ప్రకారం దీని ధర రూ. 5.90 లక్షల నుంచి 9.30 లక్షల వరకు ఉంది.
- పెట్రోల్, ఆటోమేటిక్, మ్యానువల్
- మైలేజ్ - 19.56 కిలోమీటర్ల నుంచి 23.87 కిలోమీటర్లు
- ఇంజిన్ 1197 సీసీ
- ఇంజిన్ ఆప్షన్లు 1.2 లీటర్ కే12బీ, 1.2 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజన్
- వేరియంట్స్ - సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా
- 7 ఇంచుల ఇన్ఫోటెన్మెంట్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో
- ఇతరాలు - ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ ఓవీఆర్ఎమ్స్, కిలెస్ ఎంట్రీ, ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్స్ తదితరాలు
ఇదీ చదవండి: ఈ సెట్టింగ్స్‌తో మెయిళ్లు మరింత సురక్షితం!
టాటా ఆల్ట్రోజ్..
టాటా మోటార్స్‌లో చాలా పాపులర్ మోడల్ ఇది. ఐదు కలర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఆటో హెడ్ ల్యాంప్స్, రెన్ సెన్సింగ్ వైపర్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లు, ఈబీడీతో ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
హైదరాబాద్ ఎక్స్ షోరూం ప్రకారం.. దీని ధర రూ.5.69 లక్షల నుంచి 9.45 లక్షల వరకు ఉంది.
- పెట్రోల్, డిజిల్
- మైలేజ్ - 19.05 కిలోమీటర్ల నుంచి 25.11 కిలోమీటర్లు
- ఇంజిన్ 1497 సీసీ
- ఇంజిన్ ఆప్షన్లు 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డిజిల్
- వేరియంట్స్ - ఎక్స్ఈ, ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ ప్లస్(పెట్రోల్ మాత్రమే), ఎక్స్ టీ, ఎక్స్ జెడ్, ఎక్స్ జెడ్(ఓ), ఎక్స్ జెడ్ ప్లస్
- 7 ఇంచుల ఇన్ఫోటెన్మెంట్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హర్మన్ సౌండ్ సిస్టమ్, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్
- ఇతరాలు - క్లైమేట్ కంట్రోల్, ఎత్తు మార్చుకోదగిన డ్రైవర్ సీటు, టిల్ట్ స్టీరింగ్ తదితరాలు
ఇదీ చదవండి: రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి స్టోక్ పార్క్!
రెనో కైగర్..
ఇందులో ఆరు కలర్స్ అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్ టోన్ వేరియంట్ కూడా ఉంది. నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ తదితర భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
హైదరాబాద్ ఎక్స్ షోరూం ప్రకారం.. దీని ధర రూ. 5.45 లక్షల నుంచి 9.72 లక్షల వరకు ఉంది.
- పెట్రోల్, ఆటోమేటిక్, మ్యానువల్ మోడ్
- ఇంజిన్ 999 సీసీ
- ఇంజిన్ ఆప్షన్లు 1.0 లీటర్, 1.0 లీటర్ టర్బో
- వేరియంట్స్ ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ ఎల్, ఆర్ఎక్స్టీ, ఆర్ఎక్స్ జెడ్.
- 8 ఇంచుల ఇన్ఫోటెన్మెంట్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్,
- ఇతరాలు - 7 ఇంచుల డిజిటల్ ఇన్సూమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్ తదితరాలు.
ఈ విభాగంలో మారుతీ వ్యాగనార్, టాటా టియాగో, రెనోల్ట్ క్విడ్, వోక్స్ వ్యాగన్ పోలో, గ్రాండ్ ఐ10 నియోస్ కూడా మంచి విక్రయాలను నమోదు చేస్తున్నాయి. అయితే.. బడ్జెట్, కావాల్సిన ఫీచర్లు, కారు రకం, భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాలని ఆటో ఇండస్ట్రీ నిపుణులు కోరుతున్నారు.
నోట్: ఇది కేవలం సమాచారం కొరకు మాత్రమే. కొనుగోలు నిర్ణయం పూర్తి వివరాలు తెలుసుకొని, నిపుణులను సంప్రదించి తీసుకోండి.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి షియోమి!