2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా అమ్ముడైన కార్ల జాబితాను ప్రకటించింది దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ. గత నాలుగేళ్లలో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్లలో మార్పు లేదని వెల్లడించింది.
ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్లో మొదటి 4, టాప్-10లో.. 7 మోడళ్లు తమవేనని మారుతీ సుజుకీ పేర్కొంది.
2020-21లో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్లు..
గత ఆర్థిక సంవత్సరం 1.72 లక్షల విక్రయాలతో 'స్విఫ్ట్' మొదటి స్థానాన్ని సాధించింది.
1.63 యూనిట్లు అమ్ముడైన 'బాలినో' రెండో స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలోని.. 'వ్యాగన్ ఆర్' కార్లు 1.60 లక్షలు అమ్ముడయ్యాయి.
1.59 లక్షల విక్రయాలతో ఆల్టో, 1.28 లక్షల అమ్మకాలతో డిజైర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి:వాట్సాప్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను- ఏకంగా ఖాతా ఉఫ్!