దేశంలో వాహనదారులకు పెట్రోభారం ఇప్పట్లో తగ్గెట్లు కనిపించడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలే(Fuel Price Today) ఇందుకు కారణం. తాజాగా శుక్రవారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్ పెట్రోల్ ధర 23 పైసలు పెరగ్గా.. డీజిల్‌పై 30 పైసలు పెంచుతూ.. చమురు మార్కెట్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కు చేరగా.. డీజిల్ ధర రూ.90.18కు పెరిగింది.
మెట్రో నగరాల్లో ఇలా..
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర(Mumbai petrol Price Today) 23 పైసలు పెరిగి .. రూ.107.91కు చేరగా.. లీటర్ డీజిల్ ధర (Mumbai Diesel Price Today) 32 పైసలు పెరిగి రూ.97.81 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌పై(Kolkata petrol Price Today) 29 పైసలు పెరగడం వల్ల ధర రూ.102.44కి చేరింది . లీటర్ డీజిల్‌పై (Kolkata Today Diesel Price) 30 పైసలు పెరిగి.. రూ.93.23కు చేరింది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర(Chennai petrol Price Today) 21పైసలు పెరిగి రూ.99.55కు పెరిగింది. లీటర్ డీజిల్‌కు 29 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి.. రూ.94.71 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో పెట్రోల్‌పై(Bengaluru petrol Price Today) 24 పైసలు పెరిగి.. లీటరు ధర రూ.105.39గా ఉంది. లీటర్ డీజిల్‌పై 32 పైసలు పెరిగి.. ధర రూ.95.66కు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) 25 పైసలు పెరిగి రూ.105.96 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 33 పైసలు ఎగబాకి.. రూ.98.35కు పెరిగింది.
వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) 23 పైసలు పెరిగి రూ.106.89కు చేరింది. లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.98.79 వద్ద ఉంది.
గుంటూరులో పెట్రోల్‌పై 24 పైసలు పెరిగి.. లీటర్ ధర (Petrol Price in Guntur) రూ.108.16కి పెరిగింది. డీజిల్ లీటర్‌కు 32 పైసలు పెరిగి.. రూ.100.02కు చేరింది.
ఇదీ చూడండి: భారీగా వెనకేసుకున్న అదానీ.. రోజుకు రూ. వెయ్యి కోట్ల సంపాదన