ETV Bharat / business

గూగుల్​నే మోసం చేసిన ఘనుడు.. ఎలాగో చూడండి!

గూగుల్​ మ్యాప్స్​.. ట్రాఫిక్​ను సూచించి ప్రయాణాలను సులభతరం చేసే ఓ వ్యవస్థ. ప్రస్తుత తీరిక లేని ప్రపంచంలో గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తుంది. అలాంటి వాటికి ఓ పరిష్కారం గూగుల్​ మ్యాప్స్. ఎక్కడ రోడ్లు ఖాళీగా ఉన్నాయో.. ఎక్కడ ట్రాఫిక్​ ఉందో ఇందులో చూసుకొని ప్రయాణాలు ప్లాన్​ చేసుకుంటుంటారు చాలా మంది. అయితే.. తన నైపుణ్యంతో గూగుల్​ మ్యాప్స్​నే బోల్తా కొట్టించాడో వ్యక్తి. ఆ సంగతేంటో చూద్దాం పదండి మరి.

this-man-simulated-a-traffic-jam-on-google-maps-with-99-smartphones
గూగుల్​నే మోసం చేసిన ఘనుడు..!
author img

By

Published : Feb 4, 2020, 9:21 AM IST

Updated : Aug 12, 2020, 4:50 PM IST

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రయాణాలు సవాళ్లతో కూడుకున్నవి. ముఖ్యంగా పట్టణాల్లో ట్రాఫిక్​ సమస్య మరీ ఘోరం. వీటి నుంచి తప్పించుకునేందుకు ఎంతో మంది ఉపయోగించే ముఖ్య సాధనం గూగుల్​ మ్యాప్స్​. ఎక్కడెక్కడ ట్రాఫిక్​ ఉందో.. ఏ మార్గంలో సాఫీగా సాగిపోవచ్చో ఇందులో చూసి చాలా మంది ప్రయాణాలకు సిద్ధమవుతారు.

అయితే.. అలాంటి గూగుల్​ మ్యాప్స్​నే తన నైపుణ్యంతో బోల్తా కొట్టించాడో ఘనుడు.

ట్రాఫిక్​ను వేర్వేరు రంగుల్లో ప్రదర్శించే గూగుల్​ మ్యాప్స్​.. తీవ్రతను బట్టి ఎరుపు, నారింజ రంగులను చూపిస్తుంది. ఓ నిర్దిష్ట ప్రాంతంలోని గూగుల్​ మ్యాప్స్​ వినియోగదారులను పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్​ను నిర్ధరిస్తుంది గూగుల్. అయితే.. సైమన్​ వెకర్ట్​ అనే ఓ వ్యక్తి ఆ గూగుల్​ మ్యాప్స్​ను బురిడీ కొట్టిస్తూ.. వర్చువల్​ ట్రాఫిక్​ జామ్​ను సృష్టించాడు. ఫలితంగా.. ఖాళీ రోడ్డునే రద్దీగా చూపిస్తూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపించింది. ఇది చూసి ఆశ్చర్యపోవడం గూగుల్​ వంతైంది.

ఇలా చేశాడు..

ఈ హ్యాకింగ్​ కోసం.. వెకర్ట్​ 99 స్మార్ట్​ఫోన్లను వాడాడు. వాటన్నింటినీ.. ఓ తోపుడు బండిలో వేసి ఖాళీ వీధిలో నెమ్మదిగా నడిచాడు. ఈ కారణంగా.. ఖాళీ రోడ్డును గూగుల్​ మ్యాప్స్​ రద్దీగా ఉన్నట్లు చూపించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

''గూగుల్ మ్యాప్స్​లో వర్చువల్​ ట్రాఫిక్​ జామ్​ను సృష్టించేందుకు.. 99 స్మార్ట్​ఫోన్లను ఓ తోపుడుబండిలో వేశాను. ఇలా చేయడం ద్వారా.. గ్రీన్​ స్ట్రీట్స్​ను(రద్దీ లేని) ఎరుపుగా (రద్దీ) మార్చవచ్చు. అయితే.. ఇది రోజువారీ జీవనంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ మార్గంలో వెళ్లాల్సిన కార్లను వేరే మార్గానికి తరలించి.. అక్కడ ట్రాఫిక్​లో చిక్కుకుపోయేలా చేయొచ్చు.''
- వీడియోలో సైమన్​ వెకర్ట్​

గూగుల్​ మ్యాప్స్​లోని లోపాల్ని అదనుగా తీసుకొని.. తన తెలివితో బోల్తా కొట్టించాడు సైమన్​. అయితే.. ఇలాంటి హ్యాకింగ్స్​ ఇతరులూ పాటిస్తే ఎందరో డ్రైవర్ల విలువైన సమయం వృథా అవుతుంది. గూగుల్​ మ్యాప్స్​ ఆధారంగానే కార్యకలాపాలు సాగించే క్యాబ్స్​.. ఎక్కువగా ప్రభావితం అవుతాయి.

గూగుల్​ మ్యాప్స్​ను సైమన్​ ఎలా మోసం చేశాడో ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. బె​ర్లిన్​లోని గూగుల్​ కార్యాలయం బయటనే ఇలా చేయడం గమనార్హం. అయితే.. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సాఫ్ట్​వేర్​ దిగ్గజ సంస్థలు నియంత్రించాలని గూగుల్​ వినియోగదారులు కోరుతున్నారు.

Last Updated : Aug 12, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.