కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా పొదుపు ఖాతా నిర్వహించుకోవాలనుకునే వారికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉత్తమమైన ఎంపిక.
మినిమం బ్యాలెన్స్ విషయంలో వినియోగదారుల్లో స్పష్టత తక్కువగా ఉంటుంది. బ్యాంకు ఖాతాలో ఎల్లప్పుడూ కొంత మొత్తం ఉండాలి అని అనుకుంటారు. 30 రోజుల పాటు రోజు ముగిసేటప్పుడు ఖాతాలో ఉండే మొత్తాన్ని కలిపి వాటి సరాసరి తీయగా వచ్చేదే నెలవారీ సరాసరి బ్యాలెన్స్.
చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందిస్తున్నాయి. వీటిని ఆయా బ్యాంకులు వివిధ పేర్లతో ఇస్తుంటాయి. వివిధ బ్యాంకులు అందిస్తోన్న ఖాతాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్
- బేసిక్ కేవైసీ డాక్యుమెంట్స్‌తో ఖాతా తెరవొచ్చు
- ఉచిత డెబిట్ కార్డు
- ఇతర బ్యాంకు ఏటీఎంలలో నాలుగు ఉచిత విత్ డ్రాలు
ఐసీఐసీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం
- ఉచిత చెక్ బుక్
- ఉచిత క్యాష్ డిపాజిట్
- నిర్దిష్ట పరిమితి తర్వాత వేరే బ్యాంకు ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకుంటే ఛార్జీలు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్
- ఉచిత ఏటీఎం కార్డు (అంతర్జాతీయంగా వాడుకునే సదుపాయం)
- ఫోన్ బ్యాంకింగ్
- ఇతర బ్యాంకు ఏటీఎంలలో నాలుగా విత్ డ్రాలు ఉచితం
యాక్సిస్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్
- ఉచిత రూపే డెబిట్ కార్డు
- 10 వేల వరకు క్యాష్ డిపాజిట్ లిమిట్
- ఇతర బ్యాంకు ఏటీఎంలలో నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్
ఇండస్ఇండ్ స్మాల్ సేవింగ్స్ అకౌంట్
- ఉచిత డెబిట్ కార్డు
- పాస్ బుక్ ఉచితం
- ఫ్రీ చెక్ బుక్
- ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ట్రాన్సాక్షన్స్
ఐడీఎఫ్సీ ప్రథమ్ సేవింగ్స్ అకౌంట్
- ఇంటర్నెట్ బ్యాంకింగ్
- మొబైల్ బ్యాంకింగ్
- ఉచిత చెక్ బుక్, పాస్ బుక్
- ఉచిత డెబిట్ కార్డు
ఆర్బీఎల్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్
- గరిష్ఠంగా రూ.1 లక్ష డిపాజిట్
- ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యం
కోటక్ మహీంద్ర 811 అకౌంట్
- ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు
- స్కాన్ అండ్ పే ఆప్షన్
- నెఫ్ట్, ఆర్టీజీఎస్ సౌకర్యం
స్టాండర్డ్ చార్టర్ బేసిక్ బ్యాంకింగ్ అకౌంట్
- ఉచిత ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు
- లాకర్ సౌకర్యంపై డిస్కౌంట్
- డోర్ స్టేప్ సౌకర్యాలు
ఇవే కాకుండా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా కూడా జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరుచుకోవచ్చు.
ఇవీ చదవండి: