కొవిడ్-19 సృష్టించిన ఇబ్బందుల కారణంగా ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి బ్యాంకుల్లో 11.6 శాతం మేర నిరర్ధక ఆస్తులు పేరుకుపోతాయని ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ఓ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి 8.6 శాతంగా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తులు.. ఆర్థిక ఏడాది చివరకి 11.3 నుంచి 11.6 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది.
లాక్డౌన్ వల్లే..
బ్యాంకుల లాభదాయకత తగ్గిన కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 45వేల కోట్ల నుంచి రూ. 82వేల 500 కోట్ల వరకు మూలధనం అవసరం అవుతుందని ఐసీఆర్ఏ పేర్కొంది. రుణ గ్రహీతల చెల్లింపు సామర్థ్యంపై.. లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది ఐసీఆర్ఏ.
ఇదీ చదవండి: 'వలస కార్మికుల సంక్షోభం వారికి ఓ గుణపాఠం'