ETV Bharat / business

ఫుల్ జోష్​లో మార్కెట్లు​-‌ పెట్టుబడుల జోరు మంచిదేనా? - స్టాక్స్​ పెట్టుబడులు

స్టాక్‌ మార్కెట్లు మునుపెన్నడూ చూడని గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు షేర్లలో పెట్టుబడి వైపు మళ్లింది. తొందరగా అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఆలోచనతో చాలామంది తమ పెట్టుబడులను వీటికి మళ్లిస్తున్నారు. కానీ, ఇది కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పొరపాట్లు చేస్తే.. కష్టార్జితం కళ్లముందే కరిగిపోతుంది. ఇలాంటి చిక్కులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దామా!

The market is on high but investment with careful
ఫుల్ జోష్​లో మార్కెట్లు​..‌ పెట్టుబడుల జోరు మంచిదేనా?
author img

By

Published : Dec 4, 2020, 9:58 AM IST

వృద్ధి దశలో ఉన్నా.. పతనం అవుతున్నా స్టాక్‌ మార్కెట్‌ ఎప్పుడూ మనకు పెట్టుబడి అవకాశాలను ఇస్తూనే ఉంటుంది. అయితే, ఆయా సందర్భాల్లో మదుపరులు తీసుకునే నిర్ణయాలే వారి లాభనష్టాలను ప్రభావితం చేస్తుంటాయి. ఏయే అంశాల్లో సాధారణంగా మదుపరులు పొరపాట్లు చేస్తుంటారు.. వాటిని అరికట్టడానికి ఏం చేయాలన్నది తెలుసుకోవడమే ముఖ్యం.

వదంతులు నమ్మి

మార్కెట్‌ వృద్ధి చెందుతున్నప్పుడు కొన్ని వదంతులు, చిట్కాలు మన దృష్టికి వస్తుంటాయి. వీటిని నమ్మి మదుపు చేయడం మంచిది కాదు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని, మీ కష్టార్జితాన్ని పెట్టుబడిగా మలచాలి.

ఇతరులను అనుసరిస్తే

మనకు తెలిసిన స్నేహితులు, బంధువులు చాలామంది మార్కెట్లో మదుపు చేస్తుంటారు. వారికి ఒకటో రెండో షేర్లు మంచి లాభాలను ఆర్జించి పెట్టవచ్చు. ఇలా వాళ్లకు కలిసి వచ్చిన షేర్లు మనకూ కలిసొస్తాయని చెప్పలేం. ఇతరులను అనుసరించి, మీకు తగని మదుపు నిర్ణయాలు తీసుకుంటే.. కొన్నిసార్లు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ట్రేడర్‌-ఇన్వెస్టర్‌

మంచి కంపెనీల షేర్లను కొని, దీర్ఘకాలం కొనసాగాలనే ఆలోచనతో (ఇన్వెస్టర్‌గా) ఉన్నారనుకుందాం.. కానీ, స్వల్ప లాభనష్టాలకు ట్రేడర్‌గా (వెంట వెంటనే క్రయవిక్రయాలు జరపడం) మారిపోయారనుకోండి.. లేదా ట్రేడర్‌గా ఒక కంపెనీ షేరు కొని, అధిక నష్టభయం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్టర్‌గా మారడం.. ఈ రెండు సందర్భాల్లోనూ నష్టపోయే అవకాశం లేదా రాగల లాభాలను అందుకోకపోవడం జరగవచ్చు. కాబట్టి, స్పష్టతతో వ్యవహరించండి.

వ్యూహం-క్రమశిక్షణ

ట్రేడర్‌, ఇన్వెస్టర్‌ ఎవరైనా చక్కటి పెట్టుబడి వ్యూహాన్ని ఎంపిక చేసుకోవాలి. దాన్ని క్రమశిక్షణతో ఆచరించాలి. వ్యూహం లేనప్పుడు.. ఉన్నా ఆచరించనప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పాలి. ట్రేడర్లు నష్టాన్ని తగ్గించుకోవడానికి స్టాప్‌ లాస్‌, లాభాలను రక్షించుకోవడానికి ట్రైలింగ్‌ స్టాప్‌లాస్‌లాంటి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలి.

మొత్తం ఒకచోటే

పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. పెట్టుబడుల కోసం మీరు మార్కెట్‌కు తీసుకొచ్చే మొత్తాన్ని ఒకే కంపెనీలో లేదా ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. కొంతమేర వైవిధ్యాన్ని పాటించేలా పలు రంగాల్లోని కొన్ని నాణ్యమైన షేర్లలో పెట్టుబడి పెట్టడం మేలు.

సగటు చేస్తూ

అంతగా నాణ్యత లేని కంపెనీ షేరు ధర తగ్గే కొద్దీ సగటు చేస్తూ వెళ్లడం మంచిది కాదు. అన్ని విధాలా సరైన కంపెనీల్లోనే ఈ పద్ధతి సత్ఫలితాలు ఇస్తుందని గుర్తుంచుకోవాలి.

మార్కెట్‌ గమనం

జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఎప్పటికప్పుడు మార్కెట్‌ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. దాని గమనంపైనే అధిక దృష్టి పెట్టి, కచ్చితంగా సూచీల కదలికలను అంచనా వేయడం సాధ్యం కాదు. మార్కెట్‌ ఏ దశలో ఉన్నా.. మీరు ఎంపిక చేసుకున్న మంచి కంపెనీలో ఎంత ఎక్కువ కాలం కొనసాగారన్నదే మీ రాబడిని నిర్ణయిస్తుంది.

భావోద్వేగాలతో

అత్యాశ, భయం వంటి భావోద్వేగాలతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని సాధించేంత వరకూ మదుపు కొనసాగించడం.. లేదా మీరు అనుకుంటున్న లాభం/నష్టం వచ్చినప్పుడే ఒకటికి రెండుసార్లు ఆలోచించి లావాదేవీలను నిర్వహించాలి.

ముందుగా మంచి యాజమాన్యం ఉన్న కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత వారి కంపెనీ వస్తూత్పత్తులకు, సేవలకు ఉన్న మార్కెట్‌ గిరాకీని, ఆ కంపెనీ గత, భవిష్యత్‌ పనితీరు అంచనా, ఆ కంపెనీ ఉన్న రంగం తీరు తెన్నులు.. ఇలా పలు అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దీని ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కాలానుగుణంగా అవసరమైన పర్యవేక్షణ, మార్పు చేర్పులను చేసుకుంటూ విజయం వైపు సాగాలి.

అర్హతకు మించి

మార్కెట్లో ఎప్పుడూ మన వద్ద మిగులు మొత్తాన్నే మదుపు చేయాలి. అధిక లాభాల ఆశతో.. అప్పులు చేసి, ఆస్తులను తనఖా పెట్టి.. డబ్బు తెచ్చి షేర్లను కొనకూడదు. ఇలాంటి నిర్ణయాల వల్ల లాభార్జన మాట ఎలా ఉన్నా..నష్టాలు వస్తే అప్పుల భారం మోయక తప్పదు.

అవగాహన లేకుండా

మీరు పెట్టుబడి పెట్టే కంపెనీ, సమయంపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. లేకపోతే.. మీరు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేరు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎక్కువ రాబడికి ఆస్కారం ఉన్న షేర్లను స్వల్పలాభానికే అమ్మేస్తుంటారు. కొన్ని షేర్లు నష్టపోతున్నా అలాగే అట్టిపెట్టుకుంటుంటారు. ఇదంతా మార్కెట్‌పై, ఆయా కంపెనీల పనితీరుపై అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. కాబట్టి, సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే.. మార్కెట్‌ను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

రచయిత- జె.వేణుగోపాల్‌, జెన్‌ మనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.