ఇది స్మార్ట్ఫోన్ల యుగం. మొబైల్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ రకాల ఫీచర్లను కొత్తగా వచ్చే ఫోన్లలో ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే శాంసంగ్ 75 వేల పాడ్‌కాస్ట్‌లను తన వినియోగదారులకు ఉచితంగా అందిస్తోందని గిజ్చైనా వెబ్సైట్ తెలిపింది. 'శాంసంగ్ ఫ్రీ' అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్.. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 నుంచి వచ్చే మోడల్స్‌లో హోంస్క్రీన్కు జోడించారు. దీని ద్వారా యూజర్ కావాల్సిన కంటెంట్‌ను చూడవచ్చు, వినవచ్చు, చదువుకోవచ్చు.
ఆ సిరీస్‌లకు మాత్రమే..
గిజ్ చైనా కథనం ప్రకారం.. పాడ్ కాస్ట్ ఫీచర్ అనేది కొత్తగా జత చేశారు. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చింది శాంసంగ్. ఈ పాడ్‌కాస్ట్ ఫీచర్ గెలాక్సీ ఎస్ , గెలాక్సీ నోట్ సిరీస్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మోడల్స్‌లో మాత్రమే కాకుండా కంపెనీ అందించే ఉచిత యాప్ ద్వారా 'ఏ' సిరీస్‌లో వీటిని వినవచ్చు. అంతేగాక ఫోన్లో ఉండే శాంసంగ్ అకౌంట్లో లాగ్ ఇన్ కావడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం, ఏ సిరీస్‌లోనూ ఈ ఉచిత సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇందుకుగాను వారు పాకెట్ కాస్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాడ్‌కాస్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాలోని సంస్థల నుంచి తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు గిజ్చైనా తెలిపింది.
ఇదీ చూడండి: శాంసంగ్ బడ్జెట్ ఫోన్ ఎం-12 విడుదల- ధర, ఫీచర్లు ఇవే..