ETV Bharat / business

త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ! - fiscal stimulus package

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వీటి ప్రభావం స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)పై పడే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు కూడా మరింత కనిష్ఠానికి పడిపోయో ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో భారీ ప్యాకేజి ప్రకటించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిస్తోంది.

stimulus package, package
త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ!
author img

By

Published : Apr 16, 2021, 9:10 AM IST

దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)పై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌) జీడీపీ వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలలు (2021 జనవరి-మార్చి) కన్నా పడిపోయే అవకాశం ఉందని భావిస్తోంది.

వైరస్‌ కట్టడికి గతంలో మాదిరిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడానికి బదులు ప్రజలు భౌతిక దూరం పాటించేలా నిబంధనలను కఠినంగా అమలు చేయడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలను సృష్టించేందుకు మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులను అధికం చేసే ఆలోచన ఉన్నప్పటికీ పారిశ్రామికవాడల్లో ఆంక్షలు, వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వెళ్లడం వంటి కారణాల రీత్యా అది సాధ్యం కాకపోవచ్చని అనుకుంటున్నారు. గ్రామాలకు చేరుకున్న వలస కూలీలకు అక్కడే పనులు కల్పించేలా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల చేయడమే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ఉపాధిహామీకి రూ.73 వేల కోట్లు కేటాయించింది.

ఈ కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు కూలీలకు ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే విషయాన్నీ ఆర్థిక శాఖ చురుగ్గా పరిశీలిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తోంది.

ఇదీ చూడండి: బంగాల్‌లో ఒకేదశలో ఎన్నికలపై ఈసీ క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.