ETV Bharat / business

రాష్ట్రాలు అప్పులు చేసుకోవాల్సిందే! - GST revenue

రాష్ట్రాలకు జీఎస్​టీ ఆదాయం తగ్గినా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదని అటార్నీ జనరల్ ​కేకే వేణుగోపాల్​ అభిప్రాయపడ్డారు. ఇకపై ఆదాయం తగ్గితే అదనంగా రుణాలు చేసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు.

GST revenue
రాష్ట్రాలు అప్పులు చేసుకోవాల్సిందే!
author img

By

Published : Jul 31, 2020, 5:12 AM IST

రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం తగ్గినా, పరిహారం చెలించాల్సిన 'చట్టబద్ధబాధ్యత' కేంద్రానికి లేదని అటార్నీ జనరల్‌ (ఏజీ) కేకే వేణుగోపాల్‌ అభిప్రాయం పడినట్లు సమాచారం. అందువల్ల ఇకపై పన్ను ఆదాయం తగ్గితే, రాష్ట్రాలు అదనంగా రుణాలు చేసుకోవాల్సి రావచ్చు. జీఎస్‌టీ ప్రవేశ పెట్టిన క్రమంలో, ఆదాయం తగ్గితే రాష్ట్రాలకు అయిదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి విదితమే. పరిహార నిధికి రాబడి తగ్గడంతో సమస్య ఏర్పడింది. కొవిడ్‌ సంక్షోభం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో పరిహార నిధి కోసం మార్కెట్‌ నుంచి రుణాలు సమీకరించేందుకు ఉన్న చట్టబద్ధతపై అభిప్రాయం తెలపాలని గత మార్చిలో ఏజీ అభిప్రాయాన్ని కేంద్రం కోరింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత కేంద్రానికి లేదని ఏజీ తెలిపినట్లు సమాచారం.

ఇవీ జీఎస్‌టీ మండలి ముందున్న మార్గాలు

  • జీఎస్‌టీ రేట్లను హేతుబద్దీకరించడం
  • మరిన్ని ఉత్పత్తులపై పరిహార సెస్‌ విధిచడం లేదా ఇప్పటికే వసూలు చేస్తున్న సెస్‌ను పెంచడం
  • రాష్ట్రాలు మరిన్ని రుణాలు సమీకరించుకోవడం. వీటిని పరిహార నిధికి వచ్చే మొత్తం ద్వారా తీర్చడం.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో జీఎస్‌టీ రేట్లు, సెస్‌ రేట్లు పెంచడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల రాష్ట్రాలు మార్కెట్ల నుంచి నిధులు అప్పు చేయాల్సిందే. దీనిపై ఏం చేయాలనే విషయాన్ని జీఎస్‌టీ మండలి నిర్ణయించాల్సి ఉంది. నీ 2019-20 సంవత్సరానికి జీఎస్‌టీ పరిహారనిధికి వసూలైంది రూ.95,444 కోట్లే అయినా, కేంద్రం రాష్ట్రాలకు రూ.1.65 లక్షల కోట్లు ఇచ్చింది.

ఇదీ చూడండి: రిలయన్స్​: జూన్​ త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.