ETV Bharat / business

Mars pet care expansion: రూ. 500 కోట్లతో మార్స్​ పెట్​ కేర్​ కంపెనీ విస్తరణ..

author img

By

Published : Dec 16, 2021, 4:56 PM IST

Mars pet care expansion: పదమూడేళ్లుగా పెంపుడు జంతువులకు ఆహారాన్ని తయారుచేస్తున్న ప్రముఖ కంపెనీ మార్స్​ పెట్​ కేర్.. రాష్ట్రంలో మరింత విస్తరించనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్​ను కలిసిన కంపెనీ ప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. 500 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్న ఈ కంపెనీ దాదాపు 200 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

mars pet care expansion
మార్స్ పెట్​ కేర్ కంపెనీ

Mars pet care expansion: దేశంలో ప్రముఖ పెట్ ఫుడ్ కంపెనీ మార్స్ పెట్ కేర్.. రాష్ట్రంలో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. 2008 నుంచి హైదరాబాద్​లో ఈ కంపెనీ పెంపుడు జంతువుల ఆహారాన్ని తయారుచేస్తోంది. ఈ మేరకు మార్స్​ పెట్​ కేర్​ ప్రతినిధులు.. ప్రగతిభవన్​లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ను కలిశారు. హైదరాబాద్​లో ఉన్న తమ కంపెనీని రూ. 500 కోట్ల పెట్టుబడితో మరింత విస్తరిస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

200 మందికి ఉపాధి

కంపెనీ విస్తరణ ద్వారా దేశంలో పెరుగుతున్న పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తితో పాటు, ఆసియా వ్యాప్తంగా పెట్ ఫుడ్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు కంపెనీ విస్తరణ ద్వారా 200 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గణేశ్​ రమణి పేర్కొన్నారు. మార్స్ పెట్ కేర్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రకటనను స్వాగతిస్తూ.. మెగా ప్రాజెక్టు కేటగిరీ కింద మెరుగైన రాయితీలు అందజేస్తామని కంపెనీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Gramee Naturals Telangana : గ్రామీ నేచురల్స్.. ఈ గానుగ నూనెలు ఆరోగ్యానికి శ్రేయస్కరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.