టీడీఎస్‌కు సంబంధించి పోస్టల్ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. పోస్టల్ శాఖ అందిస్తున్న ఏ పథకం కింద అయినా రూ. 20 లక్షలకు మించి నగదును విత్‌డ్రా చేస్తే వాటిపై టీడీఎస్ వర్తిస్తుందని తెలిపింది. ఇవే నిబంధనలు పీపీఎఫ్‌ను విత్‌డ్రాలకూ వర్తింస్తుందని స్పష్టం చేసింది. సవరించిన ఆదాయ పన్ను చట్టం-1961 సెక్షన్ 194ఎన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
గత మూడేళ్లుగా ఐటీఆర్‌లు దాఖలు చేయకపోతే విత్‌డ్రా చేసే మొత్తం నుంచి టీడీఎస్‌ను వసూలు చేస్తామని తెలిపింది. ఫైనాన్స్ యాక్ట్ 2020 ప్రకారం 2020 జులై 1 నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయిని స్పష్టం చేసింది. పన్ను చెల్లించని పెట్టుబడిదారులు ఓ ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల నుంచి రూ. కోటి వరకు విత్‌డ్రా చేస్తే వారి నుంచి 2 శాతం టీడీఎస్‌గా వసూలు చేస్తామని తెలిపింది. అలానే కోటి రూపాయలు మించిన వారిపై 5 శాతం టీడీఎస్ విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆదాయపన్ను కట్టే వారు వారు కోటి రూపాయల మించి విత్‌డ్రా చేస్తే.. వారిపై 2శాతం టీడీఎస్ విధిస్తామని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఆదాయపు పన్ను 'టీడీఎస్' ఫారమ్‌లో మార్పులు