ETV Bharat / business

టీసీఎస్​పై కరోనా దెబ్బ- రూ.1123కోట్లు తగ్గిన లాభం - business news updates

తొలి త్రైమాసికంలో సాఫ్ట్​వేర్ దిగ్గజం టీసీఎస్ నికర లాభం 13.8 శాతం తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,131 కోట్ల నికర లాభం పొందగా.. ఈ సారి రూ.7008 కోట్లకే పరిమితమైంది. ఆదాయం మాత్రం సల్వంగా పెరిగింది.

TCS quarterly net profit falls nearly 14 pc to Rs 7,008 cr
రూ.1123కోట్లు తగ్గిన టీసీఎస్ నికర లాభం
author img

By

Published : Jul 9, 2020, 7:36 PM IST

కరోనా సంక్షోభం కారణంగా దేశ దిగ్గజ సాఫ్ట్​వేర్ సంస్థ టీసీఎస్​ లాభాలు క్షీణించాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభాలు 13.8 శాతం తగ్గి రూ.7,008 కోట్లకే పరిమితమైనట్లు సంస్థ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది టీసీఎస్​.

తొలి త్రైమాసికంలో ఆదాయంపరంగా చూస్తే మాత్రం స్వల్ప వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.38,172కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈ ఏడాది రూ.38,322కోట్లకు పెరిగింది.

కొవిడ్​ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లాక్​డౌన్, ఇతర ఆంక్షల నడుమే ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం ముగిసింది. భారత ఐటీ సంస్థలపైనా ఈ ప్రభావం పడింది.

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి సంస్థ కోలుకుంటుందని తొలి త్రైమాసికం ప్రారంభంలోనే అంచనా వేసింది టీసీఎస్.

ఇదీ చూడండి: ఇన్​స్టా​​ సహా ఆ 89 యాప్​లపై సైన్యం నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.