కెరియర్లో తాత్కాలిక విరామం అనంతరం ఉద్యోగం చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) (Tcs Careers) శుభవార్త చెప్పింది. మహిళా నిపుణుల కోసం అతిపెద్ద 'రిక్రూట్‌మెంట్ డ్రైవ్'ను (Tcs Recruitment 2021) ప్రారంభించింది.
"ఓ వ్యక్తిలో నైపుణ్యాలు, సామర్థ్యం అనేవి ఎప్పుడూ ఉంటాయి. ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన మహిళా నిపుణుల్లో స్ఫూర్తి నింపడమే కాకుండా.. వారిలోని టాలెంట్‌ను ఆవిష్కరించడానికి ఇదొక గొప్ప అవకాశం."
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
'వారికొక గుర్తింపు..'
'మహిళల్లోని ప్రత్యేక నైపుణ్యాలు ప్రపంచాన్ని మార్చగలవు. వారి ప్రతిభను టీసీఎస్ గౌరవిస్తుంది. ప్రతిభావంతులైన ఔత్సాహికుల కోసం ఈ ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని రూపొందించినట్లు' టీసీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా తమ సంస్థలో అందుబాటులో ఉన్న పలు ఉద్యోగాల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.
"ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో నేర్చుకోవడం అనేది స్థిరంగా ఉంటుందని మేం నమ్ముతున్నాం. ప్రస్తుత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా.. మీ కెరియర్లో మరింత ప్రత్యేకంగా ఎదగడానికి ఇదో గొప్ప అవకాశం. అలాగే సామూహిక ఆవిష్కరణలు, జ్ఞానం ద్వారా గొప్ప భవిష్యత్తును నిర్మించాలని సంస్థ భావిస్తోంది. అందువల్ల మీ అనుభవం, ఆలోచనలు.. ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు వినూత్న మార్గాన్ని అందిస్తాయని టీసీఎస్ నమ్ముతోంది.''
-టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
అర్హతలు ఏంటి?
గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన అభ్యర్థులు టీసీఎస్ రిక్రూట్మెంట్కు (Tcs Recruitment 2021) అర్హులు. వీరికి 2-5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం(Tcs Recruitment for Experienced) కలిగి ఉండాలి.
దరఖాస్తు ఎలా..?
ఆసక్తి గల నిపుణులు వారి వారి నైపుణ్యాలకు అనుగుణంగా దరఖాస్తు (Tcs Careers 2021 Registration) చేసుకోవాలి. అనంతరం అర్హుల జాబితాను రూపొందించి ఇంటర్వ్యూ వివరాలను ఈ-మెయిల్ చేస్తామని టీసీఎస్ పేర్కొంది.
కావాల్సిన నైపుణ్యాలు ఏంటి?
- ఎస్‌క్యూఎల్(SQL) సర్వర్ డీబీఏ(DBA)
- లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్
- నెట్‌వర్క్ అడ్మిన్
- మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్
- ఆటోమేషన్ టెస్టింగ్
- పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్
- యాంగులర్ జేఎస్(Angular JS)
- ఒరాకిల్ డీబీఏ(DBA)
- సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్
- జావా డెవలపర్
- డాట్ నెట్ డెవలపర్
- ఆండ్రాయిడ్ డెవలపర్
- ఐఓఎస్(IOS) డెవలపర్
- విండోస్ అడ్మిన్
- పైథాన్ డెవలపర్
- పీఎల్ఎస్క్యూఎల్(PLSQL)
ఇవీ చదవండి:
- IT Jobs: ఐటీ ఉద్యోగాల్లో 50 శాతానికి పైగా మహిళలే..
- దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు- అర్హతలు ఇవే
- ఐటీలో ఫ్రెషర్స్‌కి భారీ ఆఫర్లు- ప్యాకేజీలు ఎంతంటే..
- పేటీఎంలో 20 వేల ఉద్యోగాలు- వారికే ప్రాధాన్యం!
- అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు- అప్లయ్ చేశారా?
- Job Alert: నిరుద్యోగులకు శుభవార్త- భారీగా ఉద్యోగాలు
- Recruitments: 50 లక్షల కొత్త నియామకాలు!