ఐటీ దిగ్గజం టీసీఎస్ గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్ నిర్వహించినందుకు గానూ ఈ ఘనత సాధించింది. సంస్థ నిర్వహించిన టీసీఎస్ కోడ్‌విటా కార్యక్రమానికి 34 దేశాల నుంచి 1,36,054 మంది విద్యార్థులు హాజరయ్యారు.
పోటీదారులను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు నీల్ ఫోస్టర్ అభినందించారు. ఈ ఘనత సాధించినందుకు అభ్యర్థులు గర్వపడాలని వ్యాఖ్యానించారు.
వివిధ నేపథ్యాలకు చెందిన యువతకు ప్రోగ్రామింగ్ రంగంలో అవకాశం పొందడానికి ఈ కార్యక్రమం ఓ చక్కని వేదిక అని టీసీఎస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) అనంత కృష్ణన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు 10వేల డాలర్లు, 7వేల డాలర్లు, 3వేల డాలర్లు చొప్పున బహుమానంగా అందజేశారు.
ఇదీ చదవండి : భారత్‌లో స్పుత్నిక్ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభం