Taxpayer Complaints: ఐటీ రిటర్న్‌లకు గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో.. మరికొంత కాలం పొడిగించాలని పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో #Extend_Due_Date_Immediately హ్యాష్‌ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. వాస్తవానికి 2021-22 అసెస్‌మెంట్ ఇయార్‌కు సంబంధించిన పన్ను చెల్లించేందుకు ఈ ఏడాది జులై 31తో ముగిసింది. కానీ, కొవిడ్ వ్యాప్తి, ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వం దానిని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఐటీ సమస్యలను దెప్పిపొడుస్తూ ట్వీట్లు చేశారు. డిసెంబర్ 31 అనే తుదిగడువు పోర్టల్ డెవలపర్లకే గానీ.. పన్ను చెల్లింపుదార్లకు మాత్రం సరిపోదని పేర్కొన్నారు. మరికొందరు ఐటీ పోర్టల్ సమస్యలను స్క్రీన్ షాట్లు తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు.
మరో పక్క ఆదాయపు పన్నుశాఖ డిసెంబర్ 27 వరకు 4,67,45,249 మంది ఐటీఆర్ ఫైలింగ్ చేసినట్లు పేర్కొంది. నిన్న ఒక్క రోజే 15 లక్షల మందికి పైగా రిటర్నులు దాఖలు చేసినట్లు వెల్లడించింది. అవసరమైన అదనపు సాయంకోసం orm@cpc.incometax.gov.inలో సంప్రదించాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్‌కు డిసెంబర్ 31న తుదిగడువు కాగా.. లేట్ ఫైలింగ్ ఫీజుతో చెల్లంచడానికి మార్చి 2022 మార్చి 31 వరకు గడువు ఉంది.
-
Income Tax Portal is down again...#Extend_Due_Date_Immediately pic.twitter.com/T6iLVFtyEf
— CA.Shobhit Kesharwani (@kesharwani_ca) December 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Income Tax Portal is down again...#Extend_Due_Date_Immediately pic.twitter.com/T6iLVFtyEf
— CA.Shobhit Kesharwani (@kesharwani_ca) December 28, 2021Income Tax Portal is down again...#Extend_Due_Date_Immediately pic.twitter.com/T6iLVFtyEf
— CA.Shobhit Kesharwani (@kesharwani_ca) December 28, 2021
ఇదీ చూడండి: ఐపీఓ రూల్స్ కఠినతరం.. ఇక ఆ నిధులు వాడలేరు!