భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్ బిడ్ దాఖలు చేసింది. టాటా గ్రూప్‌తో పాటు మరికొన్ని సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్లు దాఖలు చేసినట్టు డీఐపీఏఎమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు.
ఎయిర్ఇండియా కొనుగోలుకు ఈఓఐ బిడ్ దాఖలు చేసేందుకు తుది గడువు.. సోమవారం సాయంత్రం 5 గంటలు. అయితే టాటా గ్రూప్ చివరి నిమిషంలో బిడ్ దాఖలు చేసినట్టు సమాచారం.
మరోవైపు బిడ్లు దాఖలు చేసిన ఇతర సంస్థల పేర్లు, మొత్తం దాఖలైన బిడ్ల గురించి పాండే స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో టాటా గ్రూప్.. ఒంటరిగా బిడ్ దాఖలు చేసిందో లేక ఏదైనా విమానయాన సంస్థలో అనుసంధానమై ఈఓఐ వేసిందో ఇంకా తెలియరాలేదు.
ఈఓఐ బిడ్లకు అనుమతి పొందిన వారి వివరాలు జనవరి 6న తెలియనున్నాయి. అనంతరం వారు ఆర్థిక బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:- ఉద్యోగుల చేతికే ఎయిర్ ఇండియా!