ETV Bharat / business

లాక్​డౌన్​ ఉన్నా కొత్త కారు కొనుక్కోండిలా... - కరోనా న్యూస్

వాహనాల ఆన్​లైన్ విక్రయాలను ప్రారంభించింది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. 'క్లిక్‌ టూ డ్రైవ్‌' పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలుదారులకు నేరుగా ఇంటివద్దకే నచ్చిన వాహనాన్ని డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.

passenger vehicle sales online
ఆన్​లైన్​లో టాటా మోటార్స్ అమ్మకాలు
author img

By

Published : Apr 14, 2020, 12:27 PM IST

దేశవ్యాప్త లాక్​డౌన్ నేపథ్యంలో స్తంభించిన వాహన విక్రయాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్​. ఇందుకోసం 'క్లిక్‌ టూ డ్రైవ్‌' పేరుతో ఆన్‌లైన్‌ అమ్మకాల ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

ఒక్క క్లిక్‌తో కొనుగోలుదారులు ప్రయాణికుల వాహనాలను ఆర్డర్​ చేయొచ్చని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 750కు పైగా విక్రయశాలల డీలర్లతో ఈ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించామని, ఇంటి వద్దకే వాహనాన్ని అందజేస్తామని వెల్లడించింది.

కొనుగోలు ప్రక్రియ ఇలా..

  • 'క్లిక్‌ టూ డ్రైవ్‌' వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న వినియోగదారులు.. టాటా మోటార్స్‌ వాహన శ్రేణిలో నచ్చిన మోడల్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
  • వీడియో బ్రోచర్‌లో ఫీచర్లు, ఇతర సదుపాయాలను తెలుసుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌లో కొంత మొత్తాన్ని చెల్లించి బుకింగ్‌ చేసుకోవచ్చు.
  • నచ్చిన వాహనాన్ని హోం డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు.
  • సమీప డీలర్​ వద్దకు వెళ్లి వాహనాన్ని స్వయంగా తీసుకునే సదుపాయం ఉంది.
  • ఫైనాన్స్‌, ఎక్స్ఛేంజీ సేవలనూ కొనుగోలుదార్లు పొందొచ్చు.

ఇదీ చూడండి:'స్విగ్గీలో ఇక నిత్యావసరాల హోం డెలివరీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.