ETV Bharat / business

సఫారీ ఈజ్ బ్యాక్.. ఫార్చునర్ కొత్త మోడల్ - Toyota New Fortuner Features

దేశంలో అత్యంత ఆదరణ పొందిన ఎస్​యూవీల్లో టాటా సఫారీ పేరు కచ్చితంగా ఉంటుంది. గత ఏడాది వీటి తయారీని నిలిపివేసిన టాటా మోటార్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. త్వరలో మార్కెట్లోకి సరికొత్త రూపంలో సఫారీని తేనున్నట్లు ప్రకటించింది. బుధవారం నాడు టొయోటా మోటార్స్ సరికొత్త ఫార్చునర్​ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ రెండు కొత్త మోడళ్ల విశేషాలు తెలుసుందాం!

New Fortuner from Toyota
టొయోటా నుంచి కొత్త ఫార్చునర్
author img

By

Published : Jan 6, 2021, 10:23 PM IST

టాటా మోటార్స్‌ ఎస్‌యూవీ అభిమానులకు శుభవార్త చెప్పింది. సఫారీ మోడల్‌ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురానుంది. గతేడాది టాటా సంస్థ వీటిని నిలిపివేసింది. కానీ, కొన్నాళ్ల క్రితం టాటామోటార్స్‌ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఒక వీడియోను షేర్‌ చేసింది. దానిలో సఫారీలో కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియజేసింది. అంతేకాదు ఇటీవల ఓ కొత్తమోడల్‌ రేఖా చిత్రాన్ని ఉంచింది. తాజాగా ఆల్‌ న్యూ సఫారీని విడుదల చేయనున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. దీనిపై బుధవారం వివరాలు వెల్లడిస్తూ గ్రావిటాస్‌ పేరుతో టాటా సఫారీ ప్రాజెక్టును పునరుద్ధరించినట్లు వెల్లడించింది. గ్రావిటాస్‌ను గతేడాది ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇప్పుడు అదే సఫారీగా మారింది.

కొత్త సఫారీలు ఈ నెల షోరూమ్‌లకు చేరుకుంటాయి. త్వరలోనే ఈ వాహనాలకు సంబంధించిన బుకింగ్స్‌ మొదలు కానున్నాయి. దీనిపై టాటా ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ విభాగం ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర స్పందించారు. 'మా ఫ్లాగ్‌ షిప్‌ ఎస్‌యూవీని తిరిగి మార్కెట్లోకి తీసుకురావడాన్ని గర్వంగా భావిస్తున్నాము. భారీగా అభిమానులను సంపాదించుకొని సఫారీ ఒక ఐకానిక్‌ బ్రాండ్‌గా నిలిచింది. దీని కొత్త డిజైన్‌, సామర్థ్యం, ఫీచర్లు, దృఢత్వంతో ఇది అభిమానులకు అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. కొత్త సఫారీ కూడా మార్కెట్లో అభిమానులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం' అని పేర్కొన్నారు.

చూసేందుకు హ్యారియర్​లా..

ఇప్పటికే ఉన్న హ్యారియర్​లానే సరికొత్త సఫారీ కూడా ఓఎంఈజీఏఆర్‌సీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. దీనిలో ఇంపాక్ట్‌ 2.0 డిజైనింగ్‌ను వాడటంతో చూడటానికి హ్యారియర్‌ను తలపిస్తుంది. అలాయ్‌వీల్స్‌కు సరికొత్త డిజైన్‌ను వాడారు. స్టెప్డ్​‌ అప్‌ రూఫ్‌, మూడో వరుస ప్యాసింజెర్‌ సీట్లు, సరికొత్త టెయిల్‌ ల్యాంప్స్‌లు వాడుతున్నారు. హ్యారియర్‌తో పోలిస్తే సఫారీ మరింత పొడవుగా, ఎత్తుగా ఉంది. ఈ కారులో 2.0 టర్బోఛార్జిడ్‌ డీజిల్‌ ఇంజిన్ ఉండనుండటంతో 168 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 350 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ కూడా విడుదలవుతుంది. ఆప్షన్‌ను బట్టి సిక్స్‌స్పీడ్‌ మాన్యూవల్‌, ఆటోమేటిక్ గేర్‌బాక్స్​లు ఉన్నాయి.

Tata Safari
టాటా సఫారీ కొత్త రేఖా చిత్రం

టొయోటా కొత్త ఫార్చూనర్..

ప్రీమియం ఎస్​యూవీ ఫార్చునర్ విభాగంలో టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) సరికొత్త మోడల్​ను బుధవారం విడుదల చేసింది. దీని ధరను (దిల్లీ ఎక్స్​ షోరూం) రూ.29.98 లక్షల నుంచి రూ.37.43 లక్షలుగా నిర్ణయించింది.

దీనితో పాటు లెజెండర్ పేరుతో రూ.37.58 లక్షల ధరలో కొత్త మోడల్​ను తీసుకొచ్చింది.

Toyota drives in new Fortuner
టొయోటా ఫార్చునర్

కియా కొత్త లోగో..

దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ దిగ్గజం కియా మోటార్స్ కొత్త లోగోను ఆవిష్కరించింది. భవిష్యత్ మొబిలిటీ పరిశ్రమలో న్యాయకత్వ స్థానాన్ని ఏర్పరుచుకోవాలనే వాహన తయారీ దారుల ఆకాంక్షకు సూచికగా ఈ లోగోను తీసుకొచ్చినట్లు వెల్లడించింది కియా మోటార్స్.

kia new logo
కియా కొత్త లోగో

ఇదీ చూడండి:టీకా రాకతో ఆర్థికవ్యవస్థ భారీ రికవరీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.