ETV Bharat / business

స్టార్టప్ సాంకేతికతతో కరోనాపై యుద్ధం! - corona news

కొవిడ్‌-19 నివారించేందుకు సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నాయి అంకుర సంస్థలు. కరోనాను కట్టడి చేసేందుకు వినూత్న ఆవిష్కరణలతో ముందుకొస్తున్నాయి. సాంకేతికతతో మహమ్మారిపై పోరుకు దిగుతున్నాయి.

t hub startup companies developing technology to fight with covid-19
స్టార్టప్ సాంకేతికతో.. కరోనాపై ​ యుద్ధం!
author img

By

Published : Apr 17, 2020, 9:15 AM IST

మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారిని జయించేందుకు సాంకేతికత ఎంతో అవసరం అవుతోంది. ఈ అవసరమే కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయత్నాలు చేసేందుకు అవకాశాలనిస్తోంది. దీన్ని ఒడిసిపట్టుకునేందుకు హైదరాబాద్‌ టి-హబ్‌లో కొలువైన కొన్ని అంకుర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

కొవిడ్‌-19 నివారించేందుకు సాధ్యమైనంత వరకూ తమ వంతుగా కృషి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటి సంక్షోభాలు వచ్చినా.. వాటికి సాంకేతికంగా సమాధానం చెప్పేందుకు ఈ ఆవిష్కరణలు తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెషిన్‌ లెర్నింగ్‌, ఏఆర్‌, వీఆర్‌ సాంకేతికతలు ఆరోగ్య రంగంలో ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. కరోనాతో పోరులో తమ అంకురాలు ముందుకు రావడం గర్వించే విషయమని, ఈ సంస్థలకు అన్ని విధాలా తాము తోడ్పాటునందిస్తున్నామని టి-హబ్‌ సీఈఓ రవి నారాయణ్‌ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలతో వచ్చిన సంస్థలు.. వాటి ఆవిష్కరణలను పరిశీలిస్తే...

బ్లూ సెమీ

t hub startup companies developing technology to fight with covid-19
స్టార్టప్ సాంకేతికతో.. కరోనాపై ​ యుద్ధం!

వైర్‌లెస్‌ థర్మల్‌ సెన్సార్లను రూపొందించింది. గుంపులుగా ఉన్న వ్యక్తుల్లో ఎవరికైనా నిర్ణీత శరీర ఉష్ణోగ్రతకు మించి ఉంటే కనిపెడుతుంది. దీనికోసం ‘నీమ్‌’ అనే ప్రత్యేక పరికరాన్ని రూపొందించిందీ సంస్థ. మొబైల్‌ యాప్‌కు బ్లూటూత్‌తో అనుసంధానమై సమాచారాన్ని చేరవేస్తుంది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు తక్కువ సమయంలో సమాచారాన్ని సేకరించేందుకు, వారు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇది తోడ్పడుతుంది.

మారుత్‌ డ్రోన్స్‌

దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో క్రిమినాశిని రసాయనాలను వెదజల్లేందుకు వీలుగా డ్రోన్లను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్ల సహాయంతో ఇప్పటికే తెలంగాణలోని 8 జిల్లాల్లో దాదాపు 1,900 కిలోమీటర్ల విస్తీర్ణంలో 9800 లీటర్ల ద్రావణాలను ఈ సంస్థ డ్రోన్లు పిచికారీ చేశాయి. గుంపులుగా ఉన్న వారిని గుర్తించి, హెచ్చరించడం, జ్వరంతో ఉన్నవారిని కనిపెట్టడంతోపాటు, మందులను సరఫరా చేయడంలాంటి వాటిలోనూ ఈ సంస్థ సేవలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేస్తోంది.

బైట్‌ ఫోర్స్‌

కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే కంప్యూటర్‌ విజన్‌ సాంకేతికత ‘సేఫ్‌ విజన్‌’ను రూపొందించింది. దీన్ని సీసీటీవీలు, డ్రోన్లతో అనుసంధానం చేసి.. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్కులు లేకుండా ఉన్నారా గమనించి, హెచ్చరిస్తుంది. కొవిడ్‌-19 ప్రాథమిక లక్షణాలు కనిపించినా ఇది సంబంధిత వర్గాలను అప్రమత్తం చేస్తుంది.

బ్లాక్స్‌యాప్‌.ఏఐ

డ్రోన్ల ద్వారా కరోనా హాట్‌స్పాట్లు, ఆసుపత్రులు, అంతగా సురక్షితంకాని ప్రదేశాల్లో నిఘా పెట్టేందుకు వీలుగా సాంకేతికతను అభివృద్ధి చేసంది. టిసల్లా ఏరోస్పేస్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ కృత్రిమ మేధ డ్రోన్లు పోలీసులకు, స్థానిక అధికారులకు అవసరమైన సమాచారాన్ని సేకరించి ఇస్తాయి. ఒక ప్రదేశంలో ఒకేసారి 30-50 డ్రోన్లను వినియోగించి కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తుంది. అత్యవసర మందులను సరఫరా చేసేందుకూ ఇవి ఉపయోగపడుతున్నాయి.

డైమెన్షన్‌ ఎన్‌ఎక్స్‌జీ

కొవిడ్‌-19 లక్షణాలు ఉన్న వ్యక్తులను 3-5 మీటర్ల దూరం నుంచే గుర్తించే కళ్లజోడును తయారు చేసింది. పోలీసులు, డాక్టర్లు, కరోనా నియంత్రణలో భాగంగా పనిచేసే వారికి ఇది ఉపయోగపడుతుంది. వీధుల్లో, బ్యాంకులు, అపార్ట్‌మెంట్లు తదితర ప్రాంతాల్లో దీన్ని వినియోగించి, కరోనా సోకిన వ్యక్తులను పసిగట్టవచ్చు.

  • * ఎక్స్‌ప్రెస్‌: గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉండే వారికి అవసరమైన ఔషధాలు, ఆహార పదార్థాలు, ఇతర అత్యవసర సేవలను అందిస్తోంది ఈ సంస్థ. హైదరాబాద్‌, బెంగళూరులలో 6 గేటెడ్‌ కమ్యూనిటీల్లోని దాదాపు 5,000లకు పైగా ఫ్లాట్లకు ఇది సేవలనందిస్తోంది.
  • * మాస్టర్‌ పీసీబీ: ఆసుపత్రులు, దుకాణ సముదాయాలు, ఆఫీసులు తదితర ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్లను నివారించేందుకు వీలుగా డిస్‌ఇన్ఫెక్ట్‌ స్ప్రేయర్లను రూపొందించింది. వ్యక్తుల కదలికలను గుర్తించి.. యూవీ కిరణాలతోపాటు, రసాయనాలను వెదజల్లుతూ వైరస్‌లను నాశనం చేస్తాయి. దీంతోపాటు స్మార్ట్‌ వెంటిలేటర్లను తయారు చేసింది. పాడైన వెంటిలేటర్లను బాగు చేసి, కొవిడ్‌-19 చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు అందిస్తోంది.
  • * టెరిక్‌సాఫ్ట్‌: ఒక వ్యక్తి దగ్గినా.. మాస్కు లేకుండా కనిపించినా.. ఒక ప్రాంతంలో గుంపులుగా నిలబడిన వారిని గుర్తించడం, దూరం నుంచే శరీర ఉష్ణోగ్రతను గుర్తించడంలాంటి వాటికోసం కృత్రిమ మేధతో కంప్యూటర్‌ విజన్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది.
  • * కాగ్ని.కేర్‌: కరోనా బాధితులు కోలుకున్న తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంది, తిరిగి ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయా అనేది నిరంతరం పర్యవేక్షించేందుకు పరికరాన్ని రూపొందించింది. దీంతోపాటు రెండు సరికొత్త వెంటిలేటర్లను తయారు చేసింది. బయట నుంచి ఆక్సిజన్‌ సిలిండర్‌, యంత్రం అవసరం లేకుండా పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తాయివి. దీంతోపాటు పోర్టబుల్‌ థర్మల్‌ సెన్సార్‌నూ ఆవిష్కరించింది.

ఇదీ చదవండి:వాటి కోసం 'జూమ్' ​వాడకం సురక్షితం కాదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.