ETV Bharat / business

స్విస్ బ్యాంక్ డేటా విశ్లేషిస్తే అన్నీ మూతపడ్డ ఖాతాలే! - బ్యాంకర్లు

స్విస్​ బ్యాంకు అందించిన సమాచారంతో భారత పౌరుల ఖాతాల వివరాలను బ్యాంకర్లు, అధికారులు విశ్లేషిస్తున్నారు. 2018 సంవత్సరానికి సంబంధించిన ఈ సమాచారం అధారంగా ఇప్పటికే చాలా ఖాతాలు మూతపడ్డాయని గుర్తించారు. అయితే ఈ డేటా ద్వారా అక్రమార్కుల డిపాజిట్లు, సెక్యూరిటీలు, నగదు బదిలీలు, ఇతర పెట్టుబడుల వివరాలు తెలుసుకునే అవకాశముందని వారు భావిస్తున్నారు.

స్విస్ బ్యాంక్ డేటా విశ్లేషిస్తే అన్నీ మూతపడ్డ ఖాతాలే!
author img

By

Published : Sep 8, 2019, 2:09 PM IST

Updated : Sep 29, 2019, 9:22 PM IST

భారత ప్రభుత్వం స్విస్​ బ్యాంకు అందించిన డేటా ఆధారంగా అక్రమ ఖాతాల వివరాలు విశ్లేషించడానికి సమాయత్తమవుతోంది. 2018 సంవత్సరానికి సంబంధించిన ఈ సమాచారాన్ని ఇప్పటికే ప్రాథమికంగా పరిశీలించిన బ్యాంకర్లు, నియంత్రణ అధికారులు.. అధిక శాతం ఖాతాలు ఇప్పటికే మూతపడ్డాయని గుర్తించారు.

స్విట్జర్లాండ్​ - భారత్​ చేసుకున్న ఒప్పందం మేరకు.. ఈ నెలలో స్వయంచాలక సమాచార మార్పిడి పద్ధతి (ఏఈఓఐ) ద్వారా 2018 సంవత్సరానికి సంబంధించిన ఖాతాల వివరాలు దిల్లీకి చేరాయి.

'మూలాలు తెలుసుకుంటాం...'

స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడి​ అన్ని బ్యాంకులు తమ వద్ద ఉన్న భారత పౌరుల ఖాతాల వివరాలు వెల్లడించాయి. వీటి ద్వారా భారతీయుల డిపాజిట్లు, సెక్యూరిటీలు, నగదు బదిలీలు, ఇతర పెట్టుబడుల సమాచారం తెలుసుకునే అవకాశముందని బ్యాంకర్లు భావిస్తున్నారు.

అక్రమంగా స్విస్​ బ్యాంకుల్లో లెక్కలేనంత సంపద దాచుకున్నవారిపై.. కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. స్విస్​ ఖాతాలు ఉన్న రాజకీయ నేతల గుట్టు విప్పడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు.

అత్యధికులు వారే...

స్విస్​ బ్యాంకుల్లో అక్రమ సంపద దాచుకున్నవారు ప్రధానంగా వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులేనని పలువురు బ్యాంకర్లు, రెగ్యులేటరీ అధికారులు వెల్లడించారు. వీరిలో చాలా మంది ఆగ్నేయాసియా దేశాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. మరికొందరు అమెరికా, యూకే, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో నివసిస్తున్నారని తెలిపారు.

భయంతోనే..

గత కొన్ని సంవత్సరాలుగా.. పన్నులు ఎగ్గొట్టి స్విస్ బ్యాంకుల్లో నగదు దాచుకుంటున్న వారిపై ప్రపంచదేశాలు చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో అక్రమార్కులు అధిక మొత్తంలో తమ ఖాతాలు మూసివేస్తున్నారని బ్యాంకర్లు తెలిపారు.

ఇదీ చూడండి: పండుగ వేళ ముందుజాగ్రత్త... కశ్మీర్​లో మళ్లీ ఆంక్షలు

AP Video Delivery Log - 0700 GMT News
Sunday, 8 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0613: Gaza Emigration AP Clients Only 4228845
More and more middle-class Palestinians flee Gaza
AP-APTN-0553: Hong Kong Protest AP Clients Only 4228843
HKong protesters plan march to US consulate
AP-APTN-0553: Iran IAEA No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4228844
IAEA acting chief arrives in Tehran for talks
AP-APTN-0504: US Soldier Return AP Clients Only 4228840
Body of US soldier killed in Afghanistan returned
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.