ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ... భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని 600 నగరాలు, 200 విశ్వవిద్యాలయాలకు వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది.
లాంచ్‌ప్యాడ్ కార్యక్రమం కింద విద్యార్థుల ద్వారా విశ్వవిద్యాలయాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్నట్లు తెలిపింది స్విగ్గీ.
ప్రస్తుతం 500 నగరాలు, 75 యూనివర్సిటీల్లో స్విగ్గీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఆయా నగరాల్లోని లక్షా 40 వేల రెస్టారెంట్ల ద్వారా కస్టమర్లకు ఆహారం అందిస్తోంది.
ఇదీ చూడండి : మాంద్యం భయాలు తగ్గెన్- మార్కెట్లకు లాభాలొచ్చెన్!