ETV Bharat / business

స్విగ్గీలో ఆల్కహాల్ హోండెలివరీ షురూ - ఆల్కహాల్ హోండెలివరీ రాంచీ

మందుబాబులకు మద్యాన్ని ఇంటికే తీసుకొచ్చే సేవలు ప్రారంభించింది స్విగ్గీ. రాంచీలో మద్యం హోండెలివరీ మొదలుపెట్టినట్లు వెల్లడించింది. త్వరలోనే ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు స్పష్టం చేసింది.

swiggy alcohol
స్విగ్గీ ఆల్కహాల్ హోండెలివరీ
author img

By

Published : May 21, 2020, 3:08 PM IST

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆల్కహాల్​ హోండెలివరీ ప్రారంభించినట్లు ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లోనూ మద్యాన్ని ఇళ్లకే సరఫరా చేయడానికి ప్రభుత్వాల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్​లోని ఇతర పెద్ద నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు స్విగ్గీ స్పష్టం చేసింది. డెలివరీ చేసే ముందు వినియోగదారుల వయసు నిర్ధరించుకుంటున్నట్లు పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం లైసెన్సులు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాతే రిటైల్ వ్యాపారులతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటున్నట్లు స్విగ్గీ స్పష్టం చేసింది. స్విగ్గీ యాప్​లో 'వైన్​ షాప్స్' కేటగిరీలో మద్యానికి సంబంధించిన వివరాలు ఉంటాయని తెలిపింది.

"ఆల్కహాల్​ను హోండెలివరీ చేయడం ప్రారంభించిన తర్వాత రిటైల్ ఔట్​లెట్లకు అదనపు వ్యాపార ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్కువ మంది దుకాణాల ముందు గుమిగూడకుండా చేయవచ్చు. తద్వారా వ్యక్తిగత దూరం పాటించవచ్చు."

-అనుజ్ రాఠీ, స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్

ప్రస్తుతం స్విగ్గీకి ఉన్న విస్తృత నెట్​వర్క్, సాంకేతికత, మౌలిక సదుపాయాలను ఉపయోగించి నిత్యావసర సరకులు డెలివరీ చేయడం సహా కొవిడ్ ఉపశమన చర్యల కోసం స్థానిక అధికారులకు సహకరిస్తున్నట్లు అనుజ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.