కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీలుపై విధించిన గడువు నేటి(శుక్రవారం)తో ముగియనుంది. అయితే.. దేశంలో కరోనా కేసులు భారీ పెరుగుతున్న కారణంతో అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోమారు పొడిగించింది కేంద్రం. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉత్తర్వులు జారీ చేసింది. మే 31వరకు నిషేధాన్ని పొడిగించింది.
వాటికి మినహాయింపు..
కార్గో విమానాలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమాన సర్వీసులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్ కుమార్ గురువారం సాయంత్రం సర్క్యులర్ జారీ చేశారు.
మార్చి 23 నుంచి..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తోంది.
ఇవీ చదవండి: రెండోసారి గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం