ETV Bharat / business

'టాటా-మిస్త్రీ' కేసు తీర్పు రిజర్వ్‌లో.. - జస్టిస్​ ఎస్​ ఏ బోబ్డే

సైరస్​ మిస్త్రీ నియామకంపై టాటాసన్స్, సైరస్​ ఇన్వెస్ట్​మెంట్స్ దాఖలు చేసిన పరస్పర అప్పీళ్లపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వులో ఉంచింది. ఇరు వర్గాలు రాతపూర్వకంగా తమ విజ్ఞప్తులను సమర్పించాలని త్రిసభ్య ధర్మాసనం కోరింది.

Supreme court reserves judgement of Tata vs Cyrus mistry case
రిజర్వ్‌లో 'టాటా-మిస్త్రీ' కేసు తీర్పు
author img

By

Published : Dec 18, 2020, 7:26 AM IST

సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా తిరిగి నియమిస్తూ జారీ చేసిన ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలపై టాటాసన్స్‌, సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ దాఖలు చేసిన పరస్పర అప్పీళ్లపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ విషయంలో ఇరు వర్గాలు రాతపూర్వకంగా తమ విజ్ఞప్తులను దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్​ బోపన్న, జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అక్టోబరు 2016లో టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ను తొలగించడం కంపెనీల చట్ట నిబంధనలను, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ను ఉల్లంఘించడమేనని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విచారణలో షాపూర్జీ పల్లోంజీ(ఎస్‌పీ) గ్రూప్‌ కోర్టుకు విన్నవించింది. మిస్త్రీని తొలగించడం తమ హక్కులకు లోబడే జరిగిందని.. ఎటువంటి తప్పూ తాము చేయలేదని టాటా సన్స్‌ సమర్థించుకుంది. గతేడాది డిసెంబరు 18న మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పుపై జనవరి 10న సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.

ఇదీ చదవండి:ఇక జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు: గడ్కరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.