ETV Bharat / business

sundar pichai on india: 'భారత్​లో మా ప్లాన్స్​ ఇవే'

Sundar Pichai On India: క్లౌడ్‌, ఏఐ, ఆండ్రాయిడ్‌ విభాగంలో వివిధ కార్యకలాపాల ద్వారా భారత విపణి వృద్ధికి సహకారం అందించేందుకు గూగుల్‌ కట్టుబడి ఉందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. స్థానికతకు ప్రాధాన్యమివ్వడం గూగుల్​కు ఎంతో ముఖ్యం అన్నారు.

sundar pichai
సుందర్‌ పిచాయ్‌
author img

By

Published : Dec 4, 2021, 8:30 AM IST

Sundar Pichai On India: ఓపెన్‌ ఇంటర్నెట్‌, నిబంధనల మధ్య సమతుల్యత ముఖ్యమని.. ఆలోచనలను పరస్పరం పంచుకునేందుకు, అవకాశాల సృష్టికి ఇది దోహదం చేస్తుందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అభిప్రాయపడ్డారు. క్లౌడ్‌, ఏఐ, ఆండ్రాయిడ్‌ విభాగంలో వివిధ కార్యకలాపాల ద్వారా భారత విపణి వృద్ధికి సహకారం అందించేందుకు గూగుల్‌ కట్టుబడి ఉందని హెచ్‌టీ లీడర్‌షిప్‌ సదస్సులో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

"ప్రజల జీవన విధానంలో సాంకేతికత వినియోగం పెరిగింది. సహజంగానే నిబంధనలు అవసరం అవుతాయి. వీటి రూపకల్పనలో దేశాలు తమ పౌరుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. వాళ్లకు అవి తప్పకుండా ప్రయోజనాన్ని కలిగించేలా ఉండాలి. స్థానికతకు ప్రాధాన్యమివ్వడం గూగుల్‌కు ఎంతో ముఖ్యం. ప్రతి దేశంలో ఆ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అందుకే ప్రతి దేశంలోనూ స్థానికతకు పెద్దపీట వేసేందుకు, స్థానిక చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు గూగుల్‌ కట్టుబడి ఉంది."

-- సుందర్ పిచాయ్, గూగుల్‌ సీఈఓ

అంతర్జాతీయంగా భారత కంపెనీలు తామేంటో నిరూపించుకుంటుండటం, యూనికార్న్‌లుగా అవతరించడం ప్రోత్సాహకర పరిణామమని పిచాయ్​ చెప్పారు. తాము కూడా పలు మార్గాల్లో సహకారం అందిస్తున్నామని, భారత డిజిటైజేషన్‌ పథకాల్లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని పిచాయ్‌ పేర్కొన్నారు.

భారత కంపెనీలకు సహకారం అందించడంతో పాటు ఏఐ, సాంకేతికతలను వాళ్లకు అందించాలని అనుకుంటున్నామని తెలిపారు. తద్వారా ఆ కంపెనీలు వాటి ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకు రాగలుతాయని, మరింత మంది వినియోగదార్లకూ చేరువవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'పరాగ్​' జీవిత పాఠాలు.. యువతకు స్ఫూర్తి మార్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.