ETV Bharat / business

చట్నీలూ, సాస్‌లతో కోట్లు... విన్‌గ్రీన్స్‌ ఫార్మ్స్‌ సక్సెస్​ స్టోరీ

లాక్‌డౌన్‌ సమయంలో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి... కానీ కొన్ని మాత్రం మరింత పుంజుకున్నాయి. వాటిలో ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ఒకటి. దీన్నో సదవకాశంగా తీసుకున్న విన్‌గ్రీన్స్‌ ఫార్మ్స్‌... ఎప్పటి కప్పుడు సరికొత్త ఉత్పత్తులు తెస్తూ విజయపథంలో నడుస్తోంది.

author img

By

Published : Sep 4, 2020, 9:39 AM IST

anju srivastava
anju srivastava

ఇడ్లీ, దోశల నుంచి పిజ్జా, పాస్తాల వరకూ వంటగదిలో ఎన్నెన్ని ప్రయోగాలు జరుగుతుంటాయో! ఈ విషయాన్ని గుర్తించే వినూత్నమైన ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ని తెస్తోంది విన్‌గ్రీన్స్‌. డిప్స్‌, స్ప్రెడ్స్‌, సాస్‌, నాన్‌ చిప్స్‌, సీజనింగ్స్‌, స్పైస్‌ మిక్సెస్‌, బేకరీ మిక్సెస్‌... ఇలా వందకుపైగా వెరైటీల్ని అందిస్తోంది.

మహిళల మేలు కోరి...

‘తయారీ దేశీయం... రుచి అంతర్జాతీయం’ అంటూ తమ ఉత్పత్తుల గురించి గర్వంగా చెబుతారు విన్‌గ్రీన్స్‌ వ్యవస్థాపకురాలు అంజూ శ్రీవాస్తవ. ప్రకటనల రంగంలో పనిచేసిన అంజు... తనకిష్టమైన ఆహార రంగంలో వ్యాపారం చేస్తూనే, మహిళలకు చేయూతనివ్వాలనుకున్నారు. అందుకే తన సంస్థకు ‘ఉమెన్స్‌ ఇనీషియేటివ్‌ నెట్‌వర్క్‌(విన్‌) గ్రీన్స్‌’ అని పేరు పెట్టారు. మొదట హరియాణాలోని గురుగ్రామ్‌లో అరఎకరం స్థలాన్ని 2008లో కౌలుకు తీసుకున్నారామె. దాంట్లో ఔషధ మొక్కలు... మరువం, కొత్తిమీర, తులసి, పుదీనాలాంటివి పెంచేవారు. వాటిని కుండీల్లో పెట్టి దిల్లీలో అమ్మకానికి ఉంచేవారు.

ఆ రుచికి ఫిదా

2012లో వీరి పొలంలో తులసి పంట బాగా వచ్చింది. వాటితో డిప్స్‌(చట్నీలాంటిది) తయారు చేయించారు. దానికి కొన్నిరకాల చిప్స్‌ని జోడించి ప్యాక్‌లను మార్కెట్‌లోకి తెచ్చారు. ఆ రుచికి జనాలు ఫిదా అయిపోవడంతో కంపెనీ దశ తిరిగింది. ఇప్పుడు సుమారు వంద ఎకరాలను కౌలుకు తీసుకుందీ సంస్థ. సాగు పనులకు ఆయా రైతు కుటుంబాలనే పిలుస్తారు. ‘రైతులు ఇదివరకు గోధుమ, ఆవాలు మాత్రమే పండించేవారు. దాంతో ఏడాదిలో ఎకరాకు రూ.10వేలు వచ్చేది. మేం తులసి, లెమన్‌గ్రాస్‌, బ్రకోలీ, బఠాణీ, వేరుసెనగ లాంటి వ్యాపార పంటల్ని పెంచుతున్నాం. ఇప్పుడు వాళ్లకి ఎకరాకు రూ.లక్ష వరకూ ఆదాయం వస్తోంది. బిందుసేద్యం, అంతరపంటల సాగు ద్వారా ఇది సాధ్యమవుతోంది’ అని చెబుతారు అంజు. రైతు కుటుంబాలకు చెందిన మహిళలూ సాగు పనుల్లో పాల్గొంటారు. సంస్థకు ఉన్న 50 మంది షెఫ్‌లలో 35 మంది మహిళలే. విన్‌గ్రీన్స్‌లో ఉద్యోగుల సంఖ్య 1500. వారిలో మూడోవంతు మహిళలే.

ప్రతి పదార్థమూ ఇక్కడిదే...

లాక్‌డౌన్‌ సమయంలో అనేక కొత్త ఉత్పత్తుల్ని తీసుకొచ్చింది విన్‌గ్రీన్స్‌. అందుకే కంపెనీ టర్నోవర్‌ గతేడాదితో పోలిస్తే రెట్టింపై రూ.100 కోట్లను చేరుకుంది. విన్‌గ్రీన్స్‌లో గతేడాది జ్యూరిక్‌కు చెందిన ‘రెస్పాన్సిబిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఏజీ’(రూ.90కోట్లు), సికోయా క్యాపిటల్‌(రూ.25 కోట్లు) పెట్టుబడి పెట్టాయి. వినియోగదారుల ఆహారపుటలవాట్లని గమనిస్తూ తరచూ కొత్త ఉత్పత్తుల్ని తీసుకొస్తున్నామని చెప్పే అంజు... భవిష్యత్తులో ఆరోగ్యాన్ని పెంచే పానీయాల్నీ, చిప్స్‌, డిప్‌ కాంబినేషన్లో స్నాక్స్‌నీ తెచ్చే ఆలోచనా ఉందంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.