వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లు సహా దేశీయ సూచీలపై సానుకూల ప్రభావంచూపిస్తోంది. రూపాయి బలపడటం స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది.
ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్లు వృద్ధితో 38వేల 498 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,547 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్నవి ఇవే:
ఇండియా బుల్స్, యెస్ బ్యాంకు, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ
పుంజుకున్న రూపాయి:
ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 18 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకపు విలువ 68 రూపాయల 64 పైసలుగా ఉంది.
పెరిగిన చమురు ధరలు:
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్, ఒపెక్ దేశాలు ఉత్పత్తి తగ్గించటం, ఇరాన్, వెనెజువెలాపై అమెరికా అంక్షలే ధరల పెరుగుదలకు కారణం. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 67.54 డాలర్లుగా ఉంది.