ETV Bharat / business

దేశ ఆర్థికానికి బలమైన బ్యాంకింగ్​ వ్యవస్థ కీలకం: మోదీ - ప్రధాని మోదీ న్యూస్​

రిజర్వ్​ బ్యాంకు తీసుకొచ్చిన రెండు వినూత్న పథకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. వీటితో దేశంలో పెట్టుబడుల పరిధి మరింత విస్తరిస్తుందన్నారు. మూలధన మార్కెట్​ వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలలో వినియోగదారులు నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చన్నారు మోదీ.

Strong banking system essential for an economy: PM Modi
ఆర్థిక వ్యవస్థకు బలమైన బ్యాంకింక్ వ్యవస్థ కీలకం: మోదీ
author img

By

Published : Nov 12, 2021, 12:06 PM IST

Updated : Nov 13, 2021, 8:31 AM IST

వినియోగదారుల కేంద్రీకృతంగా రిజర్వ్​ బ్యాంకు తీసుకొచ్చిన రెండు వినూత్న పథకాలను వర్చువల్​గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరెంద్ర మోదీ. ఆర్​బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్​, ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​మన్ స్కీమ్​ వల్ల దేశంలో పెట్టుబడుల పరిధి మరింత విస్తరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూలధన మార్కెట్​ను వినియోగదారులు మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన బ్యాంకింగ్​ వ్యవస్థ అవసరమన్నారు మోదీ. గత ఏడేళ్లలో ప్రభుత్వం ఆర్థిక, బ్యాకింగ్ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులను పారదర్శకంగా గుర్తించినట్లు చెప్పారు.

" ఆర్​బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌తో దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన మాధ్యమాన్ని పొందారు. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలలో చిన్న పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి కచ్చితమైన లాభాలు పొందవచ్చు. దేశ నిర్మాణానికి ఈ నిధులు సాయం చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకంతో బ్యాకింగ్ రంగంలో 'ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మన్' సాక్షాత్కారమైంది. 6-7 ఏళ్ల క్రితం బ్యాంకింగ్‌, పింఛను, బీమా రంగం.. కొంత మందికే అందుబాటులో ఉండేవి. సామాన్యులు, పేదలు, రైతులు, దళితులు, వెనకబడిన వర్గాలకు ఇవి దూరంగా ఉండేవి. కేవలం ఏడేళ్లలో పరిస్థితులు మారాయి. డిజిటల్‌ చెల్లింపుల విషయంలో ప్రపంచంలోనే భారత్‌ ముందు నిలిచింది. డిజిటల్‌ లావాదేవీలు ఈ ఏడేళ్లలో 19 రెట్లు పెరిగాయి. ఇపుడు దేశం అంతటా రోజుతో నిమిత్తం లేకుండా, 24 గంటల పాటు బ్యాంకింగ్‌ సేవలు నడుస్తున్నాయి. కరోనా క్లిష్ట సమయంలోనూ దేశానికి విస్తృత సేవలు చేసిన ఆర్థిక శాఖ, ఆర్‌బీఐలకు నా అభినందనలు. ‘అమృత్‌ మహోత్సవ్‌’ సమయంలో ఆర్‌బీఐ పాత్ర చాలా కీలకం. దేశ అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ బృందం కృషి చేస్తుందన్న విశ్వాసం నాకుంది. దేశంలో ఆర్థిక మార్కెట్లపై మదుపర్ల విశ్వాసాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది."

-ప్రధాని మోదీ.

ఏంటీ పథకాలు?

  • ఆర్​బీఐ రిటైల్ డెరెక్ట్ స్కీమ్​తో దేశంలోని చిన్న పెట్టుబడిదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలలో నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఆర్​బీఐతో ప్రభుత్వ సెక్యూరీటీల ఖాతాను సులభంగా, ఉచితంగా తెరవచ్చు. దీని నిర్వహణ కూడా సింపుల్​గా ఉంటుంది. ఈ ఖాతా ద్వారా వినియోగదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి రుణాలు, పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంతో ఈ తరహా సదుపాయం అందిస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్​ ఒకటిగా నిలిచింది.
  • ఆర్​బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్​మన్ పథకంతో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం మరింత సులభతరం కానుంది. నూతన యంత్రాంగంతో ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించవచ్చు. ఫిర్యాదు సమర్పించేందుకు, దాని స్టేటస్​ను ట్రాక్ చేసేందుకు, ఫీడ్​బ్యాక్ ఇచ్చేందుకు ఆర్​బీఐ సింగిల్​ రిఫరెన్స్ పాయింట్​ను ఏర్పాటు చేస్తుంది. అంబుడ్స్​మన్​​ పథకం కిందకు రాని ఫిర్యాదులను కస్టమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్స్​(సీఈపీసీ) యథావిధిగా
  • ఈ పథకం తర్వాత ఫండ్‌ మేనేజర్ల అవసరం ఉండదు. ఎవరైనా నేరుగా 'ఆర్‌బీఐరిటైల్‌డైరెక్ట్‌.ఇన్‌' పోర్టల్‌లో రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ (ఆర్‌డీజీ) అకౌంట్‌ ప్రారంభించి, సెక్యూరిటీలు కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు, పింఛనుదారులు ఇంట్లోనే ఉంటూ, సురక్షిత పెట్టుబడులు పెట్టొచ్చు. ఫోన్‌, ఇంటర్‌నెట్‌ ద్వారా ఈ పని చేయొచ్చు. ఈ ఆర్‌డీజీ అకౌంట్‌, బ్యాంక్‌ సేవింగ్స్‌ అకౌంట్‌తో అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి సెక్యూరిటీల కొనుగోలు సులభమవుతుంది పరిష్కరిస్తాయి. దేశవ్యాప్తంగా 30 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి.

ఖాతా ప్రారంభం, నిర్వహణ ఉచితమే

"రిజర్వు బ్యాంకు తన సేవల సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం సాంకేతికతను, వినూత్నతను ఉపయోగించుకుంటోంది. కేంద్రం, రాష్ట్రాలు జారీ చేసే సెక్యూరిటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు కొత్త పథకం వీలు కల్పిస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీల ఖాతాలను ఉచితంగా ఆర్‌బీఐ ద్వారా తెరచుకుని, నిర్వహించుకోవడానికి మదుపర్లకు వీలు కలుగుతుంది."

-శక్తికాంత దాస్‌, ఆర్‌బీఐ గవర్నర్‌

మధ్యవర్తిత్వ ఖర్చులుండవ్‌

'ఆర్థిక శాఖ, ఆర్‌బీఐలు పరస్పరం సహకరించుకోవడం వల్లే కరోనా పరిణామాలకు గురైన ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. అందువల్లే అంచనాకు మించిన రికవరీ చోటు చేసుకుంది. రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ వల్ల రిటైల్‌ మదుపర్లకు మరో పెట్టుబడి అవకాశం లభించడమే కాక బాండ్‌ మార్కెట్‌ మరింత బలం పుంజుకుంటుంది. అన్ని వేళల్లోనూ మార్కెట్‌ ఆధారిత ధరలు పొందడానికి వీలవుతుంది. ఇన్నాళ్లు రిటైల్‌ మదుపర్లు సంప్రదాయ మధ్యవర్తిత్వ వ్యవస్థకయ్యే ఖర్చును చూసి వెనకాడారు. ఇపుడు ఎటువంటి వ్యయాలు ఉండవు. అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలపై విశ్వాసం పెరుగుతుంది.'

-నిర్మలా సీతారామన్‌, ఆర్థిక మంత్రి

ఇదీ చదవండి: Gold ETF: పసిడి కొందాం.. యూనిట్ల రూపంలో

Last Updated : Nov 13, 2021, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.